వందకో వందనం..శతవందన రాగం

Posted November 9, 2016

100 rupee note got higher positionవందకో వందనం..శతవందన రాగం
పాత సినిమాకి కొత్త మార్కెట్ రేట్ వస్తే…
ముసలి రాజుకి కొత్తగా యవ్వనమొస్తే..
ఛీకొట్టిన పిల్ల మనతోటే జీవితమంటే ..
పెళ్ళైన 10 ఏళ్ళకి ఎవరైనా పిల్లనిస్తామంటే..
కోటీశ్వరుడు మీలా హాయిగా బతికితే చాలంటే..
ఇబ్బందులెదురైనప్పుడు పెళ్ళాం మీరుంటే చాలంటే..
ఫస్ట్ ర్యాంకర్ ఎప్పుడో కనిపించి జీవితంలో నువ్వు గెలిచావంటే..
పక్కింటమ్మాయి అంకుల్ లాంటి భర్త కావాలనడం మన చెవినే పడితే ..
వీడుట్టి వెధవాయి అన్న వారి కళ్ళలోమీపై ఈర్ష్య కనిపిస్తే …
ఇవే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్దీ అనుభవాలు…వేలకొద్దీ …సారీ ….వందల వందల అనుభూతులు ఓ మధ్యతరగతి మనిషికి ఎంత కిక్ ఇస్తాయో వేరే చెప్పాలా? ఇప్పుడు వంద పరిస్థితి అంతే ..ఆ నోటుని కాస్త పరీక్షగా చూడండి..పడిన చోటే లేచిన ఠీవి కనిపిస్తుంది..దాని చెక్కిళ్ళలో కొత్త మెరుపులు కనిపిస్తాయి..కాస్త చెవి దగ్గరకి తీసుకెళ్లండి 100 ల ఇళయరాజాలు..100 ల రెహ్మాన్ లు కలిపి చేస్తున్న సంగీతపు కచేరి వినిపిస్తుంది…కాస్త మనసు పెడితే శతకోటి …సారీ ….శతవందన రాగాలు మోగుతాయి ..ఏంటి విన్నారా?

                                                                                       -కిరణ్ కుమార్