2వేల నోటు వచ్చేస్తుంది..

 Posted November 6, 2016

2000 note is arrivingదేశంలో ఇప్పటి వరకు కరెన్సీ డినామినేషన్‌లో రూ.1000 నోటే పెద్దది.. ఇక నుంచి ఆ స్థానాన్ని రెండువేల రూపాయల నోటు ఆక్రమించనుంది.. ఇప్పటికే పెద్ద ఎత్తున మైసూర్‌ నోట్ల ముద్రణా కేంద్రంలో ప్రించ్‌ చేస్తున్నారు. అయిన ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ ప్రకటించకపోయినా.. అంతర్జాతీయ బిజినెస్‌ న్యూస్‌ దీన్ని ధ్రువీకరించడం విశేషం.. ఇప్పుడున్న వెయ్యి, అయిదొందల నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని అరికట్టాలంటూ నిపుణులు సూచిస్తున్న తరుణంలో అంతకన్న పెద్ద విలువు కలిగినవి రాబోతున్నాయి. నల్లధనంపై పోరాటమే అంటున్న కేంద్ర సర్కారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆర్థిక వేత్తలు పెద్ద నోట్లు ఉంటే నల్లధనం అరికట్టేలానే ఉపయోగపడాతాయని.. సొమ్ములు దేశం దాటకుండా ఇక్కడే ఉండేందుకు అవకాశముందని అంచనాలు వేస్తున్నారు.. అప్పట్లో 10వేల నోటు..
మనం రూ.2వేల నోటే పెద్దదని ఆశ్చర్యపోతున్నాం.. గతంలో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రూ 10వేల నోటు కూడా విడుదల చేసింది తెలుసా.. 1938లో ఒకసారి ముద్రించింది.. ఆ తరవాత వాటిని 1946లో రద్దు చేసింది.. మళ్లీ 1954లో మరో సారి ముద్రించింది… వాటిని కూడా 1978లో రద్దు చేసింది. ఇప్పుడు రాబోయే రూ.2వేల నోటపై ప్రజల స్పందనన బట్టి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి…