2వేల నోటుకి చిప్‌సెట్‌ ఉందా.. లేదా…!

Posted November 9, 2016
2000 notes has nano technology chip setఆర్బీఐ కొత్తగా విడుదల చేసే రూ.2వేల నోటుకు నానో టెక్నాలజీ ఉందని.. ఆ నోట్లు ఎక్కడ ఉన్న ఇట్టే కనిపెట్టొచ్చని సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న మెసెజ్‌ చదివే ఉంటారు.. అది నిజమా… కాదా.. అనే సందేహం వచ్చిందా.. అదెలా ఉన్నా ఈ కొత్త టెక్నాలజీ సాయంతో 120కిలోమీటర్ల లోతులో దాచిన కనిపెట్టొచ్చు.. జీపీఎస్‌ సాయంతో ప్రతి నోటును ట్రాక్‌ చేయోచ్చు.. దాంతో ఎక్కువ మొత్తంలో డబ్బులున్నా ఇట్టే కనిపెట్టేయోచ్చు.. అనే ఆలోచనే చాలా మందికి ఆనందానిస్తుంది.. మళ్లీ అదే ప్రశ్న ఇది నిజమా.. కాదా.. ఒక వేళ నిజమైతే మోదీ ఎందుకు ఇంకా ప్రకటించలేదు.. ఆర్బీఐ ఎందుకు మార్గ దర్శకాలు ఇవ్వలేదు.. అవును కదా.. అయితే వాస్తవానికి దూరంగా ఉన్నట్లేనా… సాంకేతికంగా చూస్తే అంత పలుచని నోట్లలో చిప్‌ పెడితే దాని సామర ్థ్యం ఎలా ఉంటుంది.. నిజంగా విద్యుత్తు, బ్యాటరీ శకి ్త లేకుండా ఇది పనిచేస్తుందా.. కచ్చితంగా లేదనే చెప్పాలి.. అదీ ప్రస్తుతం జీపీఎస్‌ టెక్నాలజీ సిగ్నల్‌ పంపాలన్నా.. తిరిగిపొందాలన్నా కొంత ప్రాసెస్‌ ఉండాలి.. అదీ భూమిలోపల 120 కి.మీ లోతులో దాచిన డ బ్బును సైతం గుర్తింది అనేది అర్థం లేనిది.. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అవన్నీ ఉత్తి పుకార్లే కాని వాస్తవాలు కాదని తెలుస్తుంది.. మరైతే రూ.
1000 నోటే ఎక్కువనుకుంటే మరెందుకు రూ.2వేల నోటు ఇచ్చారు.. అనే సందేహం వచ్చిందా.. అవును కదా.. అలాగెందుకు చేశారు.. నిజమే గతంలో వెయ్యినోట్లు రూ.100కోట్లు విడుదల చేస్తే వాడుకలోకి కేవలం రూ.10కోట్లే వస్తున్నాయట… అంటే నల్లధీరులు నొక్కెస్తున్నారనే కద అర్థం.. అందుకు పేరుకే రూ.2వేల నోటు ప్రవేశపెడుతున్నారు తప్పా.. అవి ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండకుండా తక్కువగా ఉండేలా చూస్తారు. కొంత మేర రూ.500 నోటు అందుబాటులోకి తెస్తారు.. కొత్త విధానంలో ముద్రించడం వల్ల వాటికి డూబ్లికేట్లు తీసుకురావాలంటే చాలా కష్టం.. అప్పటి వరకు నల్లకుబేరులు, ఉగ్రమూకలు, హావాలా దారులు మూటాముల్లి సర్దుకోవాల్సిందే మరి.. దాని కోసమే టెక్నాలజీ లేకుండా ఉన్నా.. విపక్షాల కోసమే నోటు గేమ్‌ తెరతీశారని తెలుస్తోంది… ఒకవేళ విడుదల చేయకుండా ఉంటే… ఈ నిర్ణయం సరైందెనా సరే… కావాలనే విపక్షాలు ఏదో ఒక వంక వెతుకుతారు… వాటిలో  కూతురు పెళ్లికి డబ్బు తీసుకెళ్లే పేదవాడు, మార్కెట్‌కు వెళ్లే రైతు ఎలా డబ్బులు తెచ్చుకుంటారు.. రూ.100నోట్లు ఉంటే భద్రత ఉండదు కదా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా టెక్నాలజీ వాడుకోవడం లేదు.. ఈ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వాడలేరు.. వారి పరిస్థితి ఏంటంటూ అనవసర రాద్దాంతం చేస్తాయి.. వాటికి కళ్లెం వేసేందుకు ఈ గేమ్‌ ప్లాన్‌ అని అర్థమవుతుంది.. చూద్దామ్‌.. ఆట ప్రారంభించిన మోదీ ఇంకెన్ని సిక్స్‌లుకొడతారో…
– శ్రీ