అసలుకంటే ముందే నకిలీ 2000 కరెన్సీ నోటు ప్రవేశం..

Posted November 12, 2016

2000 rs duplicate notes used in chikmagalur onion marketఅసలు కంటే వడ్డీ ముద్దు అంటుంటారు ఇదే అనుకుంట. దేశ ప్రజలు మొత్తం కొత్త 2000 రూపాయల నోటు ని చూడలేదు కానీ అప్పుడే నకిలీ 2000 రూపాయల నోటు మార్కెట్ లోకి వచ్చేసింది. కర్ణాటకలోని చిక్ మంగళూరు లోని ఏపీఎంసీ మార్కెట్ లో అశోక్ అనే వ్యక్తి హోల్ సేల్ గ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు .ఆయన టీ తాగడానికి వెళ్లిన సమయం లో ఉల్లిపాయలు కొనేందుకు వచ్చిన వ్యక్తులు నకిలీ నోట్లని ఇచ్చి ఉల్లిపాయలు తీసుకువెళ్లారు.ఆర్భాటం చేసిన అంత సేపు పట్టలేదు నకిలీ నోట్లు రావడం ఇదేనా నల్ల ధనాన్ని వెలికితీయడం అంటే ..!