2017-18 సంవత్సర బడ్జెట్ ముఖ్యాంశాలు

Posted February 1, 2017

2017-2018 budgetకేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ 2017-18 సంవత్సర   బడ్జెట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనేక ఆశలతో ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ప్రజా ధనానికి తాము సంరక్షకులుగా ఉంటామని జైట్లీ స్పష్టం చేశారు.  నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్ల రద్దు అని గుర్తు చేశారు. 2017-18 సంవత్సరానికి  మొత్తం బడ్జెట్ రూ. 21లక్షల 47 వేల కోట్లు కేటాయించగా  2017-18  రెవెన్యూ లోటు 1.9% కాగా ద్రవ్యలోటు లక్ష్యం 3.2%

2017-18 సంవత్సర బడ్జెట్ ముఖ్యాంశాలు

 • ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకిన భారత్ భారత్‌ ఉత్పాదక రంగం.
 • రెండంకెల నుంచి కనిష్ఠస్థాయికి తగ్గిన ద్రవ్యోల్బణం.
 • భారీగా త‌ర‌లివ‌స్తున్న విదేశీ పెట్టుబ‌డులు. విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు 361 బిలియ‌న్ డాల‌ర్లకు చేరిక.
 • రైతులకు అండ‌గా ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ 30% నుంచి 40% కి పెరుగుదల.
 • సాధార‌ణ బ‌డ్జెట్‌లో కలిసిపోయిన రైల్వే బ‌డ్జెట్‌.  2017-18గాను రైల్వేకి రూ.1,31,000 కోట్లు కేటాయింపు
 • పెద్ద‌నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల్లో పెరిగిన న‌గ‌దు నిల్వ‌లు దీంతో తగ్గున్న వ‌డ్డీ రేట్లు.
 • గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా వేగవంతంగా ఉన్న ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు.  ఇందులో జీఎస్‌టీ ఒక‌టి.
 • నిరుపేదలకు కోటి ఇళ్లనిర్మాణం
 • ప్రధాన ఆవాస్ యోజనకు రూ. 23వేల కోట్లు
 • గ్రామజ్యోతి యోజనకు రూ. 4300కోట్లు
 • ఫ్లోరైడ్ పీడిత 28వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పధకాలు
 • వ్యవసాయ, అనుబంధ రంగాలకు 1,87,223 కోట్లు ఖర్చు
 • విద్యారంగం కోసం ప్రత్యేకంగా డీటీహెచ్ ఛానెల్
 • అంత్యోదయ యోజనకు రూ.2500కోట్లు
 • 600జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
 • జాతీయ ఉపాధి హామీకి గత ఏడాది కంటే 11వేల కోట్లు పెంపు.
 • ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో రూ.లక్ష 67వేలకోట్ల
 • రూ. 5కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు ఒక శాతం కార్పోరేట్ పన్ను మినహాయింపు
 • అమరావతి వాసులకు మూలధన లాభల పన్ను మినహాయింపు
 • రక్షణ రంగానికి రూ. 2 లక్షల 74వేల కోట్లు
 • అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్నవారికి క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను రద్దు
 • నోట్ల రద్దుతో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులో 35%వృద్ది.
 • నల్లధనం నిరోధంలో భాగంగా రూ.3లక్షలకు మించి నగదు లావాదేవీలకు నో పర్మిషన్.
 • రాజకీయ పార్టీలకు నగదు విరాళం రూ. 2వేలకు మాత్రమే పరిమితం.
 • 5లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 10% నుండి 5% కి పన్ను తగ్గింపు, 3లక్షల ఆదాయం లోపు వారికి పన్ను మినహాయింపు