ఇక రూ. 250 నోటు వంతు

Posted December 14, 2016

250 note timeనల్ల ధనం వెలికి తీత సంగతేమో కానీ. .రోజుకో రకం ప్రకటన చేస్తూ కేంద్రం ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది అనే చెప్పాలి. ఇప్పటికే ఎటిఎం లు బ్యాంకు ల వద్ద క్యూ కడుతున్న ప్రజలు మరో సరి ఇబ్బంది పడక తప్పేలా లేదు. 2000 నోటుని ముందుగా విడుదల చేసిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ సన్నిహితుడు ఆడిటర్ గురుమూర్తి ఓ రామస్వామిఅంటున్నారు అంతేకాదు రూ. 250 విలువైన నోటు చలామణిలోకి వస్తుందని అంటున్నారు ప్రధాని మోదీకి సలహాదారుగా కూడా గురుమూర్తి వ్యవహరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు రూ. 2000 నోటును అప్పటికప్పుడు ముద్రించి, విడుదల చేశారని ఆయన చెప్పారు. రూ. 100, రూ. 250, రూ. 500 నోట్లను ముద్రించి, చలామణిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలుప్రారంభం అయ్యాయని గురుమూర్తి ఉవాచ.