ఒకేసారి 300 మంది వెళ్లొచ్చు వోల్వో బస్సు లో..

Posted December 1, 2016

Image result for volvo bus for 300 members

స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఓల్వో ప్రపంచంలోనే అతి పెద్ద బస్సును తయారు చేసింది. రియో డి జనీరియోలో జరిగిన ఫ్రీట్రాన్స్‌ రియో ఎగ్జిబిషన్‌లో దీనిని ప్రదర్శించింది. ఈ బస్సును ప్రత్యేకించి బ్రెజిల్‌ కోసం తయారు చేశారు. గ్రాన్‌ ఆర్కిటిక్‌ 300 పేరుతో తయారు చేసిన ఈ బస్సులో 300మంది ప్రయాణించవచ్చు. అక్కడ బస్సుల కోసం ప్రత్యేక లైన్లు ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లపై ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.మన లాగా కాదు కాబట్టి ఓకే .

30 మీటర్ల పొడువుండే బస్సులో 300 మంది సులభంగా ప్రయాణించవచ్చు. మూడు బస్సులను కలిపి ఒకే బస్సుగా దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఓల్వో ప్రతినిధులు ఏమంటున్నారంటే అత్యధిక సామర్థ్యం కలిగిన రవాణా వాహనాల ఆవిష్కరణ లో ఓల్వో ప్రధమ స్థానం లో ఉంటుంది. మేమిప్పుడు ప్రపంచంలోనే పెద్దదైన ఛాసిస్‌ కలిగిన బస్సును తీసుకొచ్చాం. రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. 22 మీటర్లు కలిగిన మరో బస్సును కూడా ఓల్వో రూపొందించింది. దీనిలో 210మంది ప్రయాణించవచ్చు.