డస్ట్ బిన్ లో పెద్ద నోట్లు…

Posted November 10, 2016

a bag full of 500 and 1000 currency notes was found dumped in a dustbin near DNS Bank Titwala
కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఫలితాలను చూపిస్తోంది.ఇందుకు ఉదాహరణ మహారాష్ట్ర లో జరిగిన ఉదంతం .తిత్వాల లోని డీయెన్ఎస్ బ్యాంకు వద్ద 500,1000 నోట్లు తో ఉన్న పెద్ద బాగ్ ను గుర్తు తెలియని వారు వదిలి వెళ్లిన సంఘటన ప్రాధాన్యతను సంతరించుకొంది.ఇటు వంటి సంఘటనలు చూస్తే ఇంకెన్ని నల్ల ధనం ఉన్న మూటలు ఏ చెత్త కుప్పలో దర్శనం ఇస్తాయో వేచి చూడాల్సిందే.పిల్లికి బిచ్చం పెట్టని వాడు వాడికడుపుకి కూడా తినలేదు అనేందుకు ఇలాంటివే ఉదాహరణలు.కరెన్సీ రద్దు కాక ముందు కట్టలు కట్టలుగా దాచిన లెక్కల్లో లేని ఈ సొమ్ము ఉన్న వాళ్ళ పరిస్థితి మింగలేక కక్క లేక నలుపుని తెలుపు ఎలా చేయాలో అర్థంకాక చెత్త కుప్పలా పాలు చేయాల్సి వస్తోంది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్క పెట్టు కోవాలనే చందంగా ముందే ఈ సొమ్ముని ఏ దాన ధర్మాలకో వాడి ఉంటె బావుండేది కనీసం పుణ్యం పురుషార్థం దక్కేది ..ఐనా అప్పుడే ఏమైంది లే ఏదో సినిమాలో చిరంజీవి అన్నట్టు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్.
మోడీ స్వచ్ఛ భారత్ అంటే ఇదా ..!

ప్రధాన మంత్రి మోడీ స్వచ్ఛ భారత్ లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగ ఉంచుకోవాలని దేశం లోని మురికిని మొత్తాన్ని సామజిక బాద్యత గా గుర్తించి శుభ్రం చేయాలన్నారు .ఇంకేముంది ప్రతి వారు మేమంటే మేమని చీపుర్లు పట్టుకొని వీధులన్నీ ఊడ్చారు, నాలుగు రోజల తర్వాత మాములే మళ్ళీ అనుకొన్నారు అంతా సరిగ్గా రెండు రోజుల క్రితం మొదలైనా నల్ల ధనాన్ని వెలికితీసే స్వచ్ఛ భారత్ దెబ్బకి నల్లధనం,దాచిన నల్ల కుబేరుల కుబుసాలు కదుల్తు చెత్త కుప్పల్లో కాస్త చెల్లని కరెన్సీ బ్యాంకుల్లా మారుతున్నాయి …జై స్వచ్ఛ భారత్ ..