ఊర్వసీ ఓ ఛాన్స్ మీకు కూడా

Posted December 2, 2016

Image result for a r rahman

భారత దేశ సంగీత దర్శకుల్లో గర్వించదగ్గర సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఒకరు. అకడెమీ అవార్డ్ తో దేశ ప్రతిష్ట పెంచిన రెహమాన్ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రెహమాన్ మ్యూజిక్ అంటే చాలు ఆ పాటలు వినేందుకు శ్రోతలు ఉర్రూతలూగుతారు. అయితే అలాంటి రెహమాన్ ప్రేక్షకులకు.. తన అభిమానులకు ఓ ఛాన్స్ ఇచ్చాడు. రెహ్మనాన్ సంగీతంలో సూపర్ హిట్ సాంగ్ ఓ విధంగా తన కెరియర్ లో మంచి బూస్టప్ ఇచ్చిన సాంగ్ ‘ఊర్వసి.. ఊర్వసి.. టెకిట్ ఈజీ పాలసి’.. సాంగ్. ప్రేమికుడు సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది.

ఈ పాటను ఇప్పుడు మళ్లీ రీమిక్స్ చేయబోతున్నాడట రెహమాన్. తన పాటను తానే రీమిక్స్ చేయడం గొప్ప విషయం. ఇక ఈ పాటలోని లిరిక్స్ మాత్రం మార్చేస్తున్నారట. దానికి ప్రేక్షకులకు ఓ అవకాశం ఇచ్చాడు రెహమాన్. ఈ పాటలోని చరణాలు, లైన్స్ ఎలా ఉండాలో మీరు కూడా రాసి పంపించండి అని రెహమాన్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం హడావిడి చేస్తున్న డీమానిటైజేషన్.. డొనాల్డ్ ట్రంప్.. హిల్లరి లాంటి టాపిక్స్ మాత్రం ఏమాత్రం వాడకుండా రాసి పంపాలని ఓ నోట్ కూడా పెట్టాడు.

సో మొత్తానికి అభిరుచి గల శ్రోతలకు రెహమాన్ నుండి ఓ అవకాశం ఇలా వచ్చిందన్నమాట. కాస్త క్రియేటివిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటారు.. మీకు అప్పుడప్పుడు కవితలు.. పాటలు రాసే అనుభవం ఉందా అయితే ఇంకే పెన్ను పట్టి ఊర్వసి సాంగ్ మీరు ట్రై చేయండి.