ఆది ఆ ఛాన్స్ కూడా మిస్

Posted November 16, 2016

Aadi Missed Chance A Hit Movie Remakeసాయి కుమార్ తనయుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెరంగేట్రం చేసిన ఆది కుర్ర హీరోల్లో తనకంటూ ఓ సెపరెట్ స్టైల్ కోసం ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. రీసెంట్ గా వచ్చిన చుట్టాలబ్బాయ్ సినిమా యావరేజ్ గా నిలిచినా తెలుగులో మరే సినిమా కమిట్ అవలేదు ఆది. ఇక ఈ క్రమంలో సాయి కుమార్ ను ఆదరించిన కన్నడ పరిశ్రమ మీద కన్నేశాడు ఆది. తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమాను రీమేక్ చేసి కన్నడలో ఎంట్రీ ఇద్దామనుకున్నాడు ఆది.

కాని ఆది కన్నా ముందే అభిషేక్ వర్మ కార్తికేయ సినిమా రీమేక్ చేసి వదులుతున్నాడు. కుమారస్వామి అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు అభిషేక్ వర్మ నిర్మాతగా కూడా పనిచేస్తున్నాడు. రవిబాబు అదుగో మూవీలో హీరోగా ఛాన్స్ కొట్టేసిన అభిషేక్ వర్మ కార్తికేయ రీమేక్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో. ఆది చేద్దామనుకున్న ఈ రీమేక్ చేజారిపోవడంతో ప్రస్తుతం కెరియర్ సంక్షోభంలో ఉన్నాడు ఆది.