ఇంటర్‌ నన్ను చెడగొట్టిందన్న అంజలి

0
37

Posted April 19, 2017

actress anjali says about her college life details
తెలుగమ్మాయి అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. అడపా దడపా ఈమె నటించిన సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. హీరోయిన్‌గా ఎంతటి గుర్తింపు సాధించిందో అంతే విమర్శలు, వివాదాలు కూడా అంజలిని చుట్టుముట్టాయి అనే విషయం తెల్సిందే. ‘జర్నీ’ సినిమాలో తనతో నటించిన జైతో గత కొంత కాలంగా ఈమె ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాలేజ్‌ డేస్‌ను గుర్తుకు తెచ్చుకుంది.

అంజలి మాట్లాడుతూ.. తాను 10వ తరగతి వరకు మంచి స్టూడెంట్‌ను. టీచర్స్‌ చెప్పేది వినడం, వారు ఇచ్చిన హోం వర్క్‌ చేయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, క్లాస్‌ టాపర్‌గా నిలవడం అనేది నాకు తెలిసిన విషయాలు. కాని కాలేజ్‌కు వెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోయింది. కాలేజ్‌ రోజుల్లో నాకు పూర్తి స్వేచ్చ లభించింది. ఆ స్వేచ్చతో నేను స్నేహితులతో ఫుల్‌గా ఎంజాయ్‌ చేసేదాన్ని, సినిమాలకు షికార్లకు అంటూ తిరగేదానంటూ చెప్పుకొచ్చింది. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు తరుణ్‌ నటించిన ‘నువ్వే కావాలి’ సినిమా వచ్చింది. దాన్ని చూసేందుకు నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చింది. కాలేజ్‌కు బంక్‌ కొట్టి మరీ నేను సినిమాలు చూశాను. నా చదువు అటకెక్కడంకు కారణం ఇంటర్‌ అని అంజలి చెప్పుకొచ్చింది. చదువులో రాణించలేక పోతుండటం వల్లే అంజలిని సినిమాల్లోకి తీసుకు రావాలని కుటుంబ సభ్యులు భావించారట.