మోడీకి అద్వానీ గతి…రెడీగా యోగి?

0
69

Posted March 20, 2017

adityanath yogi will replace the modi place
యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశమంతటా ప్రధాని మోడీ పేరు మార్మోగిపోతోంది. ఆయన్ని రాజకీయంగా ఎలా ఢీకొట్టాలో అర్ధంగాక కాంగ్రెస్ నేతలు తలలు బాదుకుంటున్నారు. సోనియా,రాహుల్ ఏకంగా విదేశాల్లో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.ఇక ఇప్పట్లో మోడీని ఎదిరించే మొనగాడు లేడని దేశమంతా అనుకుంటుంటే…తానున్నానని ఓ సీఎం ముందుకొస్తున్నాడు.ఓ ముఖ్యమంత్రిగా ఇంకా రోజులైనా పూర్తి చేసుకోని నాయకుడి తరపున ప్రధాని మోడీ గుండెల్లో తూటాలు పేల్చే మాటలు వస్తున్నాయి.అవేంటో ..ఆ కథాకమామీషు ఏంటో చూద్దామా!

ప్రధాని మోడీ రాజకీయ జీవితాన్ని యూపీ కొత్త సీఎం ఆదిత్యనాథ్ యోగి స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నాడు.బీజేపీ లో అద్వానీ అగ్రనేతగా వెలిగిపోతున్న రోజుల్లో గుజరాత్ సీఎం గా నరేంద్ర మోడీ వున్నారు.గోధ్రా అల్లర్ల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు,చివరకు సొంత పార్టీలో నేతలు సైతం మోడీని గద్దె దించాలని డిమాండ్ చేశారు.ప్రధానిగా వున్న వాజ్ పేయీ సైతం అదే అభిప్రాయం కాస్త నర్మగర్భంగా చెప్పారు.అంతమంది ఒక్కటైనా మోడీ ని గద్దె దించలేకపోయారు.అద్వానీ ఆయనకి అండగా నిలిచి ఆ గండం గట్టెక్కించారు.కాలక్రమంలో బండ్లు ఓడలయ్యాయి..ఓడలు బండ్లయ్యాయి.అద్వానీ ని పక్కనబెట్టి మోడీ ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో దేశమంతా చూస్తోంది.అయ్యో పాపం అద్వానీ అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.ఇప్పుడు యూపీ ఎపిసోడ్ చూస్తుంటే అదే సీన్ రిపీట్ అవుతుందనిపిస్తోంది. హిందూ భావజాలాన్ని బలంగా వినిపించే ఆదిత్యనాథ్ యోగి సీఎం అవుతాడని ఎవరూ ఊహించలేదు.ఎవరూ ఆయనకి మద్దతుగా నిలవలేదు.కానీ ఆరెస్సెస్,మోడీ అండతో యోగి ఉత్తర్ ప్రదేశ్ సీఎం అయ్యాడు.

modi and adityanath yogiతాజాగా ఆదిత్యనాధ్ సీఎం అయిన వెంటనే ఆయన సన్నిహితుడు,తండ్రి వ్యాఖ్యలు ప్రధాని మోడీకి వార్నింగ్ బెల్స్ మోగినట్లే అనిపిస్తోంది.”ప్రస్తుతం ప్రధాని మోడీ ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగీజీని ఎంపిక చేసుకుని ఉండొచ్చు..ప్రజల్లో వున్న మద్దతు ప్రకారం మోడీ మళ్ళీ ప్రధాని అవొచ్చు.కానీ 2024 నాటికి మోడీ కన్నా యోగి పెద్ద నాయకుడు అవుతాడు.” అని యోగి సన్నిహితుడు చెప్పాడు.ఇక హరిద్వార్ కి చెందిన మహంత్ మానవేంద్ర “ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యారు.మున్ముందు దేశానికి నాయకుడు అవుతారు” అని అభిప్రాయపడ్డారు.వాళ్ళు వీళ్ళు అనే మాటలతో యోగికి ఏమి సంబంధం అనుకుంటున్నారా ? చివరకు యోగి తండ్రి కూడా ఇదే అభిప్రాయంతో వున్నాడు.యోగి తండ్రి ఆనంద్ బాసిత్ ఇలా చెప్పారు..”ఇప్పుడు దేశంలో ఓ ముఖ్యమైన రాష్ట్రానికి యోగి సేవలు అందిస్తున్నాడు.ఆయన త్వరలో కేంద్రానికి వెళతాడు.దేశాన్ని నడిపిస్తాడు”

ఈ వ్యాఖ్యలు ఎవరి నోటి నుంచి వచ్చినా అవి యోగి ఆలోచనలే అని ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతున్నారు.గోధ్రా అల్లర్ల నేపథ్యంలో అద్వానీని కూడా మోడీ గురించి హెచ్చరించారు ఓ వామపక్ష నేత.ఆ వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలో చూసి నిర్లక్ష్యం చేసినందుకు అద్వానీ ఇప్పుడు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం.దేశాన్ని వడివడిగా హిందుత్వ వైపు నడిపించాలని కలలు కంటున్న vhp ,rss లు అద్వానీని పక్కనబెట్టేందుకు మోడీని అస్త్రంగా వాడుకున్నాయి.ఆప్రక్రియని ఇంకా వేగవంతం చేసేందుకు ఈసారి మోడీ స్థానాన్ని యోగితో భర్తీ చేయాలనుకుంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.