అఖిల్ బడ్జెట్ మరో రాంగ్ స్టెప్..!

Posted November 19, 2016

Again Huge Budget For Akhil's Nextఅక్కినేని అఖిల్ రెండో సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు స్పీడందుకున్నాయి. ఓ పక్క తన ఎంగేజ్మెంట్ కార్యక్రమాలకు సిద్ధమవుతూనే మరో పక్క సినిమాకు సంబందించిన విషయాలను చూసుకుంటున్నాదు అఖిల్. ఇక తనయుడి మొదట సినిమా భారీ అంచనాలతో వచ్చినా నిరాశ పరచడంతో ఈసారి ఎలాగైనా హిట్ ఇవ్వాలని నాగార్జున అఖిల్ రెండో సినిమా తన బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు. విక్రం కె కుమార్ తో సినిమా ఫిక్స్ అయిన నాగ్ ఈమధ్యనే ఫైనల్ వర్షన్ కథ విని బడ్జెట్ ఎస్టిమేషన్ వేయించాడట.

విక్రం కుమార్ 40 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని అన్నాడట. అంత బడ్జెట్ పెట్టగలిగే సత్తా ఉన్నా మొదటి సినిమాకే అంత ఖర్చు పెట్టారు కాబట్టి వాటిని రాబట్టడంలో విఫలమయ్యారు. అందుకే బడ్జెట్ కంట్రోలింగ్ విషయంలో నాగార్జున విక్రం కు స్పెషల్ కేర్ తీరుకోమన్నట్టు టాక్. ఎంత వీలైతే అంత తగ్గించి స్టాండర్డ్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట. పెట్టడమే 40 పెట్టి ప్రమోషన్స్ అవి ఇవి అని మరో 5, 10 పెడితే మళ్లీ 50 కోట్ల దాకా అవుతుంది. మరి ఈ టైంలో మొదటి సినిమా ఫ్లాప్ అయ్యి 50 కోట్ల షేర్ రాబట్టాలంటే ఆ సినిమా ఓ రేంజ్ హిట్ సాధించాలి.

మరి బడ్జెట్ కు తగ్గట్టు కథను మారుస్తారో లేక కొడుకు కోసం చేసేద్దాం అంటాడో కాని నాగ్ విక్రంల చర్చ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ లో ఒకటి అయ్యింది.