చేతులు కాలాక ఆకులు పట్టుకునే ఫార్ములా..

Posted February 14, 2017

aiadmk modulations in partyఅన్నాడీఎంకేలో అంతర్గత పోరాటం తీవ్రదశకు చేరుకుందని బహిరంగ సత్యమే.సీఎం పీఠం తమకు దక్కకపోయినా రెండో వాళ్లకి అసలు దక్కకూడదన్నట్టు ఇటు శశికళ వర్గం,అటు పన్నీర్ సెల్వం వర్గం వ్యవహరించాయి.అందుకే తనకి శిక్ష పడ్డ వార్త తెలియగానే పన్నీర్ ని పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగించి,పళనిస్వామిని శాసనసభా పక్ష నేతగా ముందుకు తెచ్చింది శశికళ.ఇక చిన్నమ్మకి శిక్ష వార్త తెలియగానే పన్నీర్ ఇంటిదగ్గర మిఠాయిలు పంచుకున్నారు.అయితే ఇద్దరూ ఓ విషయం మరిచిపోయారు.అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా రెండు వర్గాలుగా కాకుండా ఏదో ఒక వైపుంటేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం అవుతుంది.ఈ విషయాన్ని రేసులో వున్న రెండు పక్షాలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీనియర్ నాయకులు కొందరు.

శశికళ,పన్నీర్ సెల్వం వర్గాల మధ్య రాజీకోసం సీనియర్లు ప్రతిపాదించిన ఫార్ములా ప్రకారం ఇలా వుంది …” పళనిస్వామి అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిగా వుంటారు.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలి.రెండు వర్గాల మధ్య వైరుధ్యాలు లేకుండా చూసుకునేందుకు సీనియర్స్ తో కూడిన ఓ కమిటీ పనిచేస్తుంది.”… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు జరగాల్సిన నష్టం జరిగాక ఈ ఫార్ములా ముందుకొచ్చింది.ఈ ఫార్ములా పై రెండు వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.