జయని తోసి చంపారా?

Posted February 7, 2017

aiadmk party leader pandian says jayalalitha death is not natural
చిన్నమ్మ శశికళ తమిళ సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంకాగానే రాజకీయ,వ్యక్తిగత ప్రత్యర్థుల నుంచి శరపరంపరగా ఆరోపణాస్త్రాలు దూసుకొస్తున్నాయి.తాజాగా జయ మరణం గురించి అన్నాడీఎంకే కి చెందిన సీనియర్ నాయకుడు పాండ్యన్ చేసిన ఆరోపణలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి.జయది సహజమరణం కాదని ,హత్య అని పాండ్యన్ అంటున్నారు.సెప్టెంబర్ 22 న పోయెస్ గార్డెన్ లో ఏదో ఘర్షణ జరిగిందని..అప్పుడు జయని నెట్టితోసేశారని పాండ్యన్ ఆరోపించారు. ఆలా గాయపడిన జయని ఆస్పత్రిలో చేర్చి ,చికిత్స వివరాలు కూడా బయటికి రాకుండా ఏదేదో చేసేశారని ఆయన డౌట్.ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు పాండ్యన్ డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యంగా సెప్టెంబర్ 22 న పోయెస్ గార్డెన్ లో వున్నవారిని విచారిస్తే జయ మరణం వెనుక గుట్టు వీడిపోతుందని పాండ్యన్ అంటున్నారు.

జయ మరణం తర్వాత మౌనంగా వుండిపోయిన పాండ్యన్ హఠాత్తుగా ఇలా సంచలన ఆరోపణలు చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలవరం రేపింది.రెండుమూడు రోజులుగా అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలు చూసి తట్టుకోలేకే తాను గొంతు విప్పినట్టు పాండ్యన్ చెప్పారు.జయతో ముఖాముఖీ మాట్లాడిన సందర్భాల్లో శశికళని ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశం తనకు లేదని ఆమె వివరించినట్టు పాండ్యన్ అంటున్నారు.ఏదేమైనా ఎంపీ శశికళ పుష్ప,జయ మేనకోడలు దీపా చిన్నమ్మకి వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలకు పాండ్యన్ వాదనతో ఎంతోకొంత బలం చేకూరింది.