ఇంటర్, డిప్లొమో తో ఎయిర్ ఇండియా జాబ్స్…

 Posted October 25, 2016

air india jobs inter and diploma candidatesసదరన్ రీజియన్‌లోని HBఎయిర్ ఇండియా లిమిటెడ్ వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ క్యాబిన్ క్య్రూ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత (పెండ్లికాని) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఈ పోస్టులను తాత్కాలికంగా ఐదేండ్ల వరకు భర్తీచేస్తారు, ఆ తర్వాత సంస్థ అవసరం దృష్ట్యా , అభ్యర్థి పనితీరునుబట్టి మరో ఐదేండ్లవరకు పొడిగించే అవకాశం ఉంది.

ట్రెయినీ క్యాబిన్ క్య్రూ:

మొత్తం పోస్టుల సంఖ్య: 300 (పురుషులు-75, మహిళలు-225)

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
పురుషులు– 75 పోస్టులు (జనరల్-36, ఓబీసీ-20, ఎస్సీ-14, ఎస్టీ-5)
మహిళలు-225 పోస్టులు (జనరల్-107, ఓబీసీ-63, ఎస్సీ-39, ఎస్టీ-16)

పనిచేసే ప్రదేశం:
సదరన్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కాలికట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయస్సు : 2016 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: -ఎత్తు:172 సెం.మీ (పురుషులు), 160 సెం.మీ (మహిళలు). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సెం.మీ వరకు ఎత్తులో మినహాయింపు ఉంటుంది.

ఎత్తుకు తగ్గ బరువు (బాడీ మాస్ ఇండెక్స్-బీఎంఐ)
పురుషులు-18-25 (నార్మల్ రేంజ్‌లో ఉండాలి)
మహిళలు-18-22 (నార్మల్ రేంజ్‌లో ఉండాలి)

కంటిచూపు: ఎయిర్ ఇండియా నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి. స్పష్టమైన కంటిచూపు (నియర్ విజన్ ఎన్/5; డిస్టంట్ విజన్ 6/6, 6/9 ప్రమాణాలకు తగ్గట్లు) ఉండాలి. రేచీకటి, వర్ణాంధత్వం ఉండకూడదు.

భాష: ఇంగ్లిష్, హిందీ అనర్గళంగా మాట్లాడాలి. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు గల ఒక విదేశీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యత ఇస్తారు
పే స్కేల్: ట్రెయినింగ్ సమయంలో నెలకు రూ. 15,000/- స్టయిఫండ్‌గా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ.35,075 చెల్లిస్తారు. జీతంతోపాటు అదనంగా ఫ్లయింగ్ అలవెన్స్‌లు, లేఓవర్ అలవెన్స్‌లు, స్టాండ్ బై అలవెన్స్‌లుంటాయి.

ట్రెయినింగ్ కేంద్రాలు: హైదరాబాద్, ముంబై లేదా ఎయిర్ ఇండియా సూచించిన ఇతర ప్రదేశాల్లో

అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎయిర్ ఇండియా లిమిటెడ్ చెన్నైలో చెల్లేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)

ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం:
గ్రూప్ డైనమిక్స్, పర్సనల్ అసెస్‌మెంట్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా
జీడీ అండ్ పీఏటీ జరిగేరోజు ఒరిజినల్ సర్టిఫికెట్‌లలు, డిమాండ్ డ్రాఫ్ట్‌తో హాజరుకావాలి.
రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: నవంబర్ 8
వెబ్‌సైట్: WWW.AIRINDIA.IN