ఐశ్వర్యరాయ్ సినిమాపై నిషేదం…

Posted October 15, 2016

 aishwarya rai ae dil hai mushkil movie release doubt

‘యే దిల్ హై ముష్కిల్’.. ఈ బాలీవుడ్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐష్-రణబీర్ రొమాన్స్ లో రెచ్చిపోయారు. ఆ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ తో అర్థమైంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా ఐష్ అందాలని చూసి తట్టుకోలేకపోయారట. అందులో కొన్ని హాట్ సీన్స్ కి కంటింగ్ చెప్పారట. టీజర్స్ లో హీటెక్కించిన ఐష్ అందాలన్నింటి చూసేద్దామని బాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ఐష్ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. ఉరి ఉగ్రవాద ఘటన నేపథ్యంలో.. పాకిస్థాన్ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు పనిచేసే సినిమాలపై సీవోఈఏఐ నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ నిషేదం కారణం ‘యే దిల్ హై ముష్కిల్’ ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నట్టు
సమాచారమ్. ఎందుకంటే.. ? ఈ చిత్రంలో పాక్‌ నటుడు ఫవాద్‌ఖాన్‌ నటించాడు.

ఉగ్రవాదానికి పాక్‌ నటీనటులకు సంబంధం లేదని.. వారిని భారత్‌ నుంచి వెళ్లగొట్టినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదని కరణ్‌ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ నేపథ్యంలో.. కరణ్ నోరు తెరవలేని పరిస్థితి. దీంతో.. కరణ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. అద్భుతాలు జరిగితే తప్ప.. ఐశ్వర్యరాయ్ సినిమా ఈ దీపావఌకి వచ్చే పరిస్థితి మాత్రం లేదు.