“వీడెవడు” … ఎవరో తెలిసిపోయిందిగా..!!

 Posted February 15, 2017

akhil reveals about veedevadu movie heroవారం రోజుల క్రితం అక్కినేని అఖిల్ ట్విట్టర్ లో ఓ పోస్టర్ షేర్ చేసి వీడెవడో  చెప్పిండటూ అభిమానులకు టెస్ట్ పెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది.  ‘వీడెవడు’ అనే టైటిల్‌తో ఉన్న ఆ పోస్టర్‌ లో హీరో వెనక్కి  తిరిగి ఉంటాడు. అలాగే  ప్రేమికుడు, పోరాటయోధుడు, హంతకుడు, విలన్‌, ఖైదీ.. ఇలాంటి పదాలతో ఆ పోస్టర్‌ నిండిపోయింది. ఈ  హీరో ఎవరో చెప్పండంటూ అఖిల్‌ ఓ క్లూ కూడా ఇచ్చాడు.  ఆయన నా టీం మేట్‌ అని ట్వీట్ చేశాడు. అయితే అభిమానులు మాత్రం గెస్ చేయేలేకపోయారు. దీంతో నిన్న వేలెంటైన్స్ డే సందర్భంగా వాడెవడో అఖిలే   చెప్పేశాడు.

అతను ఎవరో కాదు సచిన్ జోషి. అవును మూడు సంవత్సరాల క్రితం ఆషికి-2 రీమేకైన నీ జతగా నేనుండాలి అనే సినిమాతో ఘోరంగా దెబ్బతిన్న సచిన్ జోషే. ఇప్పుడు అతను వీడెవడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక  సచిన్… అఖిల్ కి టీం మేట్ ఎలా అయ్యాడంటే… వీరిద్దరూ కలిసి సిసిఎల్ క్రికెట్ లో టాలీవుడ్ టీమ్ లో ఆడారు. దీంతో వీరిద్దరూ టీమ్ మేట్స్ అయ్యారు. అదండీ వీడెవడు హిస్టరీ.

మొత్తానికి అఖిల్ పెట్టిన పజిల్ తో అభిమానులు వీడెవడండీ బాబు అని తలలు పగలగొట్టుకున్నారు. చివరికి అఖిల్ వాడెవడో చెప్పేడంతో సస్పెన్స్ నుండి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.