మొత్తానికి అఖిల్ స్టార్ట్ చేస్తున్నాడండి..!

Posted December 19, 2016

Akhil Start His Second Movie With Vikram K Kumarఅక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ ఎన్నో భారీ అంచనాలతో రాగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. వినాయక్ డైరక్షన్లో వచ్చిన అఖిల్ మూవీ తన స్టామినా అయితే చూపగలిగాడు కాని సినిమా మాత్రం హిట్ చేసుకోలేదు. ఇక ఆ క్రమంలోనే రెండో సినిమా కోసం చాలా టైం తీసుకున్న అఖిల్ మొత్తానికి విక్రం కుమార్ తో ఫిక్స్ అయ్యాడు. అయితే ఇంతలోనే విక్రం, అఖిల్ ల మ్యారేజ్ లు అడ్డు రావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నా వీరు ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 4 నుండి సెట్స్ మీదకు వెళ్లనున్నదట. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న అఖిల్ మే లో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఈ లోపు సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ప్రేకథగా రాబోతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. విక్రం మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తూనే రొమాంటిక్ మూవీగా సినిమా ఉంటుందట. నాగ్ తన సినిమాలతో ఫుల్ ఫా లో ఉండగా నాగ చైతన్య కూడా ప్రేమం, సాహసంతో హిట్ కొట్టాడు మరి ఆ ఇద్దరి హిట్ మేనియాను అఖిల్ కూడా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.