సంచులపై అఖిలేష్..గుండెల్లో యోగి

0
106

Posted April 24, 2017 at 12:18

akhilesh yadav giving to school bags to school peoples
ఓ సన్యాసి రాజకీయ అవతారం ఎత్తితే ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవడం ఎంత కష్టమో ఇప్పుడు దేశానికి బాగా అర్ధమవుతోంది. ముఖ్యంగా దశాబ్దాలుగా కులం,మతం పేరు చెప్పి ఓట్లు దండుకున్న ఉత్తర ప్రదేశ్ లోని సాంప్రదాయ రాజకీయ పార్టీలకు కళ్ళు తిరుగుతున్నాయి.అనూహ్యంగా బీజేపీ తరపున సీఎం పీఠం మీద ఎక్కి కూర్చున్న యోగి తీసుకుంటున్న నిర్ణయాలతో ఎస్పీ,బీఎస్పీ లకి ఫ్యూజ్ లు ఎగిరిపోతున్నాయి.కొత్త సీఎం యోగి మీద ఒక్క నిర్ణయం మీదైనా విమర్శ చేద్దామన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది.తాజాగా ఇలాంటిదే ఓ నిర్ణయం మాజీ సీఎం అఖిలేష్ కి చుక్కలు చూపిస్తోంది.

యూపీలో ఎన్నికల అస్త్రంగా అఖిలేష్ సర్కార్ స్కూల్ పిల్లలకి బ్యాగ్ లు పంచాలని నిర్ణయించింది.వాటి మీద సీఎం అఖిలేష్ ఫోటోలు కూడా ముద్రించింది.అయితే బ్యాగ్ లు రెడీ అయ్యేసరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.దీంతో వాటిని పంచడానికి వీల్లేకుండా పోయింది.ఎన్నికలు అయిపోయాక గుట్టలుగుట్టలుగా పడివున్న ఈ సంచులని ఏమి చేయాలో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకున్నారు.ఆ సంచుల మీద అఖిలేష్ ఫోటోలు ఉండటమే ఇందుకు కారణం.ఈ విషయాన్ని కొత్త సీఎం యోగి ఆదిత్యనాధ్ దగ్గర ప్రస్తావించడానికి కూడా వాళ్ళు భయపడ్డారు.అయితే ఓ ఉన్నతాధికారి చొరవతో విషయం యోగి దగ్గరికి చేరింది.వెంటనే సంబంధిత అధికారుల్ని పిలిపించుకున్న ఆయన ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అఖిలేష్ ఫొటోలతో వున్న సంచులు పంపిణీ చేయమని ఆదేశించారు.ఈ నిర్ణయం రాజకీయంగా సంచలనమే.అయితే ఈ పంపిణీ వల్ల సంచుల మీద అఖిలేష్ కనిపిస్తున్నా అవి తీసుకున్న వాళ్ళ గుండెల్లో మాత్రం యోగి చిత్రం ముద్రపడుతుందని ఓ బీజేపీ కార్యకర్త వ్యాఖ్యానంలో నిజం ఉందనిపిస్తుంది.