బాల్‌ఠాక్రే గా అక్షయ్..

   akshay kumar act bal thakre biopicప్రస్తుతం ‘రుస్తమ్‌’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అక్షయ్‌ కుమార్‌. ఈ విజయానందం పూర్తి కాకుండానే అక్షయ్‌కు మరో బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత బాల్‌ఠాక్రే జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బాల్‌ఠాక్రే.. మహారాష్ట్రలో ఒక ప్రభంజనం. జర్నలిస్టుగా.. రచయితగా.. రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రవేశారాయన.  

మహారాష్ట్ర పులిగా అభిమానులు వర్ణించే ఠాక్రే జీవిత గాథను ఆయన మనవడు రాహుల్‌ సినిమాగా తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్నాడని టాక్‌. ఠాక్రే పాత్ర కోసం అక్షయ్‌ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్షయ్‌ మాత్రం ఈ బయోపిక్‌పై కొంత సందిగ్ధంలో ఉన్నాడట. బాల్‌ఠాక్రే అంటే మామూలు వ్యక్తి కాదు. అలాంటి పెద్దాయన పాత్రకు తాను సరిపోతానో లేదో ముందుగా సినిమా నిర్మాణకర్తలే ఆలోచించుకోవాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను. దీనిపై నేనెలాంటి వ్యాఖ్యలు చేయలేను అని అక్కీ చెప్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే త్వరలో ఈ బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ని ఓ మహా రాజకీయవేత్తగా తెరపై చూసే అవకాశం వస్తుంది.