అలి మొదటి స్టెప్ అదుర్స్..!

Posted November 28, 2016

 Ali Hot Comments On Political Parties

కమెడియన్ అలి తాను కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా అని ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే సిని కలర్ ఒక్కటే సరిపోదు. జనాలను తన దాకా తీసుకువచ్చేందుకు గ్లామర్ తోడవుతుంది కాని వారి అటెన్షన్ ను పట్టుకోవాలంటే మాత్రం మాటల చాతుర్యం కావాలి. అయితే రీసెంట్ గా గుంటూర్ లో జరిగిన జాగో ముస్లిం.. ఛలో గుంటూర్ కార్యక్రమంలో పాల్గొన్న అలి రాజకీయ పార్టీలన్ని ముస్లింలకు టోపీలు పెడుతున్నారు. పార్టీలన్ని తామిచ్చిన వాగ్దానాలను మర్చిపోయి మైనార్టీల హామీలను నెరవేర్చట్లేదని అన్నారు.

ఎప్పుడు ఏ సినిమా ఫంక్షన్ లో అయినా సరదాగా మాట్లాడే అలి ఇలా సడెన్ గా మైనార్టీలకు కుచ్చు టోపీ అని సీరియస్ ప్రసంగం ఇవ్వడం అందరిని ఆలోచనలో పడేస్తుంది. ఎలాగు రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చిన అలి అవకాశం దొరికింది కాబట్టి ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు తన బాణం సంధించాడు. ఇక అలి కూడా నాయకుడుగా ఎదిగే టైం వచ్చిందని చెప్పుకోవచ్చు.

తన పొలిటికల్ ఎంట్రీకి అలి వేసిన మొదటి స్టెప్పు ఇదే అని కొందరు అంటున్నారు. మరి అలి మాటలు ఎంతవరకు ప్రభావితం చూపుతాయో తెలియదు కాని మొదటి మీటింగ్ తోనే తనలోని ఫైర్ ను చూపించి అలి అదరగొట్టాడు.