జనసేనలోకి ఆలీ?

0
69

Posted April 24, 2017 at 12:31

ali join in janasena party
ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ సమరభేరి మోగించిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అందుకోసం కొన్ని వ్యూహాల్ని కూడా రెడీ చేసుకుంటున్నారు.సినిమా రంగంలో తనకు బాగా సన్నిహితుడైన ఆలీ ని జనసేనలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.ఆలీ వైపు నుంచి కూడా ఇందుకు సానుకూల స్పందన కనిపించినట్టు సమాచారం.కొన్ని వర్గాలకు అధికార,ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని పవన్ భావిస్తున్నారు.పార్టీ లోకి ఆలీ రాకతో సరిపెట్టకుండా ముస్లిమ్స్ కి పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని కూడా పవన్ భావిస్తున్నారట.ఆయా నియోజకవర్గాల్లో ఆలీకి ప్రచార బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందట.ఇంతకుముందు టీడీపీ తో సన్నిహితంగా మెలిగిన ఆలీ ప్రజారాజ్యం ఏర్పాటు టైం లో కామ్ గా ఉండిపోయారు.ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో ఆలీ చేరిక వార్త హల్ చెల్ చేస్తోంది.

ఆలీ జనసేనలోకి వస్తే,పవన్ తాను అనుకున్నట్టు ముస్లిమ్స్ కి సీట్లు ఎక్కువ ఇవ్వగలిగితే మాత్రం వైసీపీ కి ఇబ్బందులు తప్పవు.ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ వోట్ బ్యాంకు గా వున్న ముస్లిమ్స్ రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ వైపు మొగ్గుజూపారు.కానీ తదనంతర పరిణామాలతో ఆ పార్టీ కి మద్దతు విషయంలో కొంత మార్పు వచ్చినప్పటికీ మెజారిటీ ఇప్పటికీ వైసీపీ నే సమర్థిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ వర్గానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ ఆలీ లాంటి వాళ్ళని జనసేన రంగంలోకి దింపితే పరిస్థితిలో భారీ మార్పులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.మొత్తానికి జనసేనలోకి ఆలీ రాక నిజమైతే వైసీపీ కి ఇంకాస్త ఇబ్బందులు పెరగడం ఖాయం.