ఆలి పంచ్ అందరికి వర్తిస్తుందా..!

Posted November 8, 2016

ali1816కమెడియన్ గా ఉన్న ఎవరైనా హీరోగా అవకాశం రాగానే ఎగిరిగంతులేయడం కామన్.. ఒకటి రెండు సినిమాలు చేశాక అసలు విషయం అర్ధమవుతుంది. అయితే ఇదే విషయంపై ఆలి మరోసారి తన మార్క్ పంచ్ వేశాడు. రీసెంట్ గా సప్తగిరి హీరోగా వస్తున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోలో ఆలి హీరోగా అవకాశం వచ్చినా కమెడియన్స్ వారి కామెడీ పాత్రలను మాత్రం వదులుకోవద్దు అని అన్నాడు.

ఆ ఈవెంట్ కు పవర్ స్టార్ తో పాటుగా సునీల్ కూడా అటెండ్ అయ్యాడు. అంటే ఇండైరెక్ట్ గా సునీల్ కు తగిలేలా ఆలి ఈ మాటలన్నాడని అంటున్నారు. ఎవరికి తగిలాయన్నది పక్కన పెడితే ఆలి చెప్పిన విషయం మాత్రం నూటికి నూరు పాళ్లు వాస్తవం. హీరోలెక్కువైన తెలుగు పరిశ్రమలో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఆర్టిస్ట్ లు తక్కువయ్యారు. వచ్చిన ఒకరిద్దరు కూడా తమకు హీరో ఇమేజ్ వచ్చేసిందని కామెడీ చేయడం మానేస్తున్నారు. మరి ఆలి చెప్పిన మాటలను బట్టి సప్తగిరి హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతాడా లేక కమెడియన్ గా కూడా చేస్తాడా అన్నది చూడాలి.