స్టార్‌ హీరోలు అంతా 100 కోట్ల వెంట.. ఇది మంచి పరిణామం కాదు

0
106

 Posted May 19, 2017 at 17:42

all heros in 100 croes interested in movie budjet
నిన్న మొన్నటి వరకు ఒక సౌత్‌ సినిమా 100 కోట్లు వసూళ్లు చేయడం అంటే చాలా గొప్ప విషయం. అయితే ఇటీవల వరుసగా పలు చిత్రాలు 100 కోట్ల వసూళ్లను సాధించాయి. దాంతో ఇప్పుడు స్టార్‌ హీరోలు అంతా కూడా 100 కోట్ల బడ్జెట్‌ సినిమాలపై పడుతున్నారు. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా కథ అవసరంను బట్టి బడ్జెట్‌ ఉండాలి. ఏదో ఒక చెత్త కథను తీసుకుని వంద కోట్లు పెట్టి స్టార్‌ హీరోతో తెరకెక్కించినంత మాత్రాన అది వర్కౌట్‌ అవుతుందని గ్యారెంటీ లేదు. ఒక కథకు ఎంత బడ్జెట్‌ అవసరమో అంతే బడ్జెట్‌ కేటాయించాలి. కాని ఇటీవల స్టార్‌ హీరోలు అంతా కూడా వంద కోట్ల బడ్జెట్‌ అంటున్నారు.

త్వరలో ప్రారంభం కాబోతున్న చిరంజీవి 151వ సినిమా కోసం రామ్‌ చరణ్‌ 130 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం జరిగింది. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న మహేష్‌బాబు, మురుగదాస్‌ సినిమాను 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సమయంలోనే తన సినిమాను కూడా 100 కోట్లకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కించాలంటూ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తన కొత్త సినిమా నిర్మాతల ముందుకు ప్రతిపాధన తీసుకు వచ్చాడు. మురుగదాస్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్‌ హీరోగా ఒక తమిళ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాప్‌ చేశాడు. విజయేంద్ర ప్రసాద్‌ ఆ సినిమాకు కథను అందించారు. మొదట ఆ సినిమాను 50 నుండి 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని మురుగదాస్‌ భావించాడు. విజయ్‌ మార్కెట్‌, ఆ కథ రేంజ్‌ అంత వరకు అయితేనే సెట్‌ అవుతుందని మురుగదాస్‌ అభిప్రాయం. కాని విజయ్‌ మాత్రం వంద కోట్లతో తీయాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు. దాంతో మురుగదాస్‌ ఆలోచనల్లో పడ్డాడు. ఇలా హీరోలు తమ అన్ని సినిమాలను వంద కోట్ల బడ్జెట్‌తో తీయాలనుకుంటే కష్టమే అని, ఇలాంటి పరిణామాలు మంచివి కావంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.