రాజకీయ పార్టీ లు గోపీలేనా ..!

Posted November 19, 2016

all political party leaders are always words war every timeరాజకీయ పార్టీలన్నీ గోపి(గోడమీద పిల్లులు) లేనా …!, దొరికితే దొంగ దొరక్క పొతే దొర అనే విధంగా ఉంటుంది వీరి తీరు. ఏదైనా ఒక్క అంశం దొరికితే ప్రజలకి మేలు చేయడంమాట ఏమో కానీ పరస్పర మాటల యుద్ధం మొదలుపెడతారు. మా పార్టీ మేలు చేస్తోంది అంటే మా పార్టీ అని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు .

మిత్ర పక్షం ఐతే ఒక మాట ,ప్రతి పక్షం ఐతే ఒకమాట మాట్లాడుతూ గొంగట్లో తింటూ వెంట్రుకలు వెతుక్కుంటూ నేటి నిజాయతి గురించి తెగ స్పీచ్ లు ఇస్తూ వుంటారు . అసలుఆ మాట కొస్తే ఏపార్టీ లో నాయకులు అక్రమాలకు పాల్పడ లేదు చెప్పండి . వడ్డీ వ్యాపారం దగ్గర్నుచి మొదలు పెట్టి చెప్పలేని వ్యాపారాలన్నీ ఏదొక పార్టీ కి చెందిన నాయకుడి కి సంబంధించినవే .అంతెందుకు గ్రామంలో వార్డ్ మెంబర్ని పోటీలో నిలబెట్టాలన్న కొద్దోగొప్పో ఆర్ధిక ,అంగ బలం వున్నా వారినే నిలబెట్టాలని చూస్తుంది ఏ పార్టీ ఐనా .

jagan and chandrababuఇక పెద్ద నాయకత్వం విషయానికొస్తే సూటిగా వాళ్ళు ప్రతి విషయం లో ఇన్వాల్వ్ కాక పోయినా జరుగుతున్న ప్రతిదీ వారి కన్ను సన్నల్లోనే జరుగుతూ ఉంటుంది .ఏదైనా సందర్భంలో విషయం బైటికి పొక్కితే వారి బండారం బైట పడకుండా ఉండేందుకు బినామీల్ని వాడటం సహజం ఉదాహరణకి జలయజ్ఞం లో జరిగిన అవినీతి, వోక్స్ వాగన్, వాన్పిక్ ఎలా చెప్తూ పొతే బోలెడు. జగన్ విషయానికొస్తే జైలు కి ఎందుకు వెళ్లినట్టు , ఏ ఆధారం లేకుండానే జైలు కితీసుకెళ్ళరా? అయన కూడా పిలిచినా వెంటనే వెళ్ళారా ? అదేం పేరంటం కాదే పిలవగానే వెళ్ళడానికి పదే పదే ఓటుకి నోటు కేసును వైసీపీ నాయకులు ఉటంకిస్తున్నారు కదా ,చంద్రబాబు ని జైలు లో పెడితే మీకొచ్చే లాభం ఏంటి ? రాజకీయంగ మైలేజీ కోసం పాత చింతకాయ పచ్చడి విషయాల్ని తీసుకు రావడం వైసీపీ అండ్ కో కి వేరే విషయం దొరక్కే అనుకోవాలి

chandrababu naidu vote for noteఓటుకి నోటు విషయం లో తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా  వుంది అంటున్నారు. తెలంగాణాలో కనీసం 10 మంది ఐనా ఉండి పార్టీ జెండా ఐనా వుంది మరి మీరు అసలున్నారా ? వాళ్ళకి వీళ్లకి పుల్లలు పెట్టె మాటలు, కధనాలు ఆపి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అందరికి మంచిది , నైతిక విలువల్ని కాపాడుతూ ప్రజల్లో కి విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది .వ్యవస్థలో ఆర్ధిక గుర్తింపు లేకపోతె మనుగడ సూన్యం అనేది జగం ఎరిగిన సత్యం . ప్రజలకి డబ్బులు ఇవ్వడం అలవాటు చేసిందెవరు ? మీ రాజకీయ నాయకులు ,పార్టీలు కాదా ? 50 నోటు, మందు సీసా నుంచి మొదలు పెడితే , క్రికెట్ కిట్ లు , ఇంటికి ఇంత అని ప్యాక్ ఏజ్ లు , బస్సు ,ఫ్లైట్ ,ట్రైన్ టికెట్ రిజర్వేషన్ ఇదంతా మీరు చేరిన అలవాట్లు కదా , వోట్ వేయడం సామజిక బాధ్యత హక్కు అంటూనే ,ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తూ ఉంటే వ్యవస్థ ఇంకెలా బాగు పడుతుంది . ప్రజల్లో చైతన్యం కాదు ముందు మీలో రావాలి. ప్రజలు మీరిస్తే తీసుకున్నారు మీదగ్గర ప్రజలకు ఇచ్చేంత సొమ్ము ఎక్కడిది ?

ysrcp and tdp political parties are always words war every timeరఫ్ గా  ఒక నియోజక వర్గం లో 2 లక్షల జనాభా వుంది అనుకుందాం . వారిలో 1 లక్ష 80 వేల మందికే ఓటు హక్కు వుంది ఒక్క వోట్ కి 200 నుంచి 300 రూపాయలు ఇచ్చినా సుమారు గా  6 కోట్ల రూపాయలు ఖర్చు ,ఇక క్యాంపైన్గ్ ఖర్చులు మీడియా ఖర్చులు వెరసి 10 కోట్లు ఖర్చు అవుతాయి ఇంత డబ్బు ఎలా వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది . అసలు రిజర్వేషన్ ప్రకారంచూస్తే ఒక కాండిడేట్ ని ఎంపిక చేయటం ఏంటో కష్టం తో కూడిన పనే కదా , డబ్బు ఒక్కటే చాలదు కదా కాండిడేట్ మీద అభిప్రాయం కూడా కీలక పాత్ర పోషిస్తుంది ,ఆఫ్ట్రాల్ ఒక కాండిడేట్ ఎంపికకే ఇంత ఆలోచించాల్సి వస్తే .ముఖ్య మంత్రి గా సుదీర్ఘ కలం పని చేసిన వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలే ముందు మనం యెంత కరెక్ట్ గా  వున్నాం అనేది కూడా ఆలోచించుకొని మాట్లాడాలి .

jagan jail entryఅక్రమ ఆస్తుల విషయం లో జైలు కి వెళ్లి బెయిల్ మీద వచ్చి న మీ నాయకుడి ని ముందు నిజాయతీగా ఉండేలా చూసుకొంటే మంచిది , ఓటు కి నోటు కేసు లో .చంద్ర బాబు ని కేంద్రం వెనకేసుకు రాబట్టి జైలు కి వెళ్లకుండా వున్నారు అని విమర్శిస్తున్న మీరు ఐతే .మీ నాయకుడు ఆస్తులని అక్రమం గా సంపాదించినవే అని కోర్ట్ లో వొప్పుకున్నారా ?. గురివింద తన నలుపుని గుర్తించదు అన్నట్టు మీరు మీ నలుపుని తెలుపు చేసుకొని తర్వాత ఇతరుల మీద వేద్దురు రాళ్లు.ఒకరిని వేలెత్తి చూపించే ముందు మనవైపు నాలుగు వేళ్ళు చూపిస్తున్నాయి అనేది గుర్తించాలి .