మలయాళ రీమేక్ తో అల్లరి నరేష్

allari naresh remake cinema

సెల్ఫీ రాజా మళ్లీ దెబ్బై పోయినా అల్లరి నరేష్ హిట్ కోసం తాను చేస్తున్న ఏ పని సక్సెస్ అవ్వట్లేదు. అందుకే మళ్లీ రీమేక్ బాట పట్టాడు అల్లరి కుర్రాడు. మలయాళంలో ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమా రీమేక్ గా అల్లరి నరేష్ సినిమా రూపొందుతుంది. అలా ఎలా డైరక్టర్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జాహ్నవి ఫిలింస్ పతాకంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. గమ్యం తర్వాత అల్లరి నరేష్ నుండి వస్తున్న హ్యూమన్ ఎమోషన్ మూవీ ఇదని అంటున్నారు చిత్రయూనిట్.

గమ్యం సినిమాలో గాలి శ్రీనుగా అదరగొట్టిన అల్లరోడు ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రలు చేసే వీలు కుదరలేదు. శంభో శివ శంభో పర్వాలేదనిపించినా మళ్లీ తన ట్రేడ్ మార్క్ సినిమాలతో నవ్వించే ప్రయత్నం చేశాడు. చేస్తున్న సినిమాలేవి హిట్ కిక్ ఇవ్వకపోవడంతో అల్లరి నరేష్ మలయాళ రీమేక్ లో నటించడానికి సై అన్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తనలోని డిఫరెంట్ యాంగిల్ ను ట్రై చేస్తున్నాడట. చూస్తుంటే ఈసారి నరేష్ హిట్ కొట్టేందుకు బాగా కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది.