స్టైలిష్ స్టార్ కు కూతురు పుట్టింది..!

Posted November 22, 2016

allu arjun blessed a baby girlస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట పండుగ వాతావరణం ఏర్పడింది. నిన్న సాయంత్రం తన భార్య స్నేహారెడ్డి ఓ కూతురుకి జన్మనిచ్చింది. సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే బన్ని తనకు కూతురు పుట్టిన ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

ఇంతకీ బన్ని ఏం ట్వీట్ చేశాడు అంటే.. నాకు కూతురు పుట్టింది.. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.. ఒక కొడుకు ఒక కూతురు ఇంతకన్నా ఏం కావాలి.. నేను చాలా అదృష్టవంతున్ని అంటూ బన్ని తన సంతోషాన్ని పంచుకున్నాడు. సినిమాల్లోనే కాదు తన ఫ్యామిలీ విషయంలో కూడా స్టైలిష్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇక బన్నికి కూతురు పుట్టిందని తెలియగానే మెగా ఫ్యాన్స్ లోనే కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా పండుగ వాతావరణం నెలకుంది.

Blessed with a Baby Girl ! Soooo Happppyyyyyy right now ! One boy & one girl. Could’nt ask for more. Thank you for all the wishes. Lucky me