బన్ని పాట అదిరిపోయే రికార్డ్..!

Posted November 21, 2016

Allu Arjun Record For His Songమెగా హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఎంటో అందరికి తెలిసిందే. వరుస సినిమాలను సక్సెస్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న బన్ని మరో సూపర్ రికార్డ్ అందుకున్నాడు. బన్ని సినిమాలో సాంగ్స్ అందరిని ఆకట్టుకుంటాయి. యూట్యూబ్ లో బన్ని రేసుగుర్రంలోని సినిమా చూపిస్త మావా సాంగ్ అత్యధికంగా 19 లక్షల వ్యూయర్ కౌంట్ సాధించింది. తెలుగు సినిమాల్లో ఒక పాటకు ఈ రేంజ్ వ్యూయర్ కౌంట్ రావడం ఇదే మొదటిసారి. త్వరలోనే 2 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేయబోతుంది ఈ సాంగ్.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. యాదగిరి రాసిన ఈ సాంగ్ సింహా, గంగ పాడటం జరిగింది. జాని మాస్టర్ ఈ సాంగ్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. క్యాచీగా ఉండటమే కాదు సాంగ్ చూసేందుకు సరదాగా ఉంటుంది అందుకే యూట్యూబ్ లో అందరు అన్నిసార్లు చూశారు. మ్యూజిక్ విషయంలో అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకే బన్ని సినిమాలోని సాంగ్స్ కే ఇలాంటి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరక్షన్లో దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.