హీరోని అవమానించిన అమలా..!

Posted November 9, 2016

am11మలయాళం నుండి వచ్చి కోలీవుడ్లో అతి తక్కువ సినిమాలతోనే క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించిన అమలా పాల్ కెరియర్ త్వరగానే ముగించుకుని డైరక్టర్ ఏ.ఎల్.విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే రెండేళ్లు కలిసి ఉన్నారో లేదో అప్పుడే వారి వ్యవహారం విడాకులు తీసుకునే పరిస్థితికి దారి తీసింది. కారణాలేవైనా అమలా, విజయ్ లు విడిపోయారు. అయితే పెళ్లై విడిపోయినా సరే అమలా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది.

ఇప్పటికే తమిళంలో సూపర్ ఫాంలో ఉన్న అమ్మడు తెలుగులో అల్లరి నరేష్ సినిమా కోసం అడిగారట. నరేష్ టాలీవుడ్ కామెడీ హీరో.. అయితే కోలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించిన అమలా అల్లరి నరేష్ ఆఫర్ ను తిరస్కరించిందట. డేట్స్ ఖాళీ లేవు అన్న సమాధానం చెప్పేసినా అసలు విషయం మాత్రం నరేష్ లాంటి కామెడీ హీరోతో జతకట్టడం ఇష్టం లేకనే అమలా అలా చెప్పించిందట.

ఎవరైతేనేం హీరో అంటే హీరోనే తీసుకునే పారితోషికం బట్టే హీరోలు కూడా మారుతుంటారు. కోటిస్తే కొత్త కుర్రాడితో అయినా రొమాన్స్ చేసే హీరోయిన్స్ ఆల్రెడీ కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న అల్లరోడితో నటించడానికి నో చెప్పడం కాస్త విడ్డూరంగానే ఉంది.