సూపర్ స్టార్ ని కెలికిన శకుని మామ…

Posted January 24, 2017

amar singh said wrong statement on amitabh family
అమర్ సింగ్ ని యూపీ సీఎం అఖిలేష్ ఎందుకు శకుని మామ అని పిలుస్తున్నాడో ఇప్పుడు అర్ధం అవుతోంది. ఎన్ని వేషాలు వేసినా సమాజ్ వాదీ లో ఇక చోటు దక్కదని తెలిసిపోయాక అమర్ సింగ్ లండన్ పారిపోయాడు.అంతటితో ఆగలేదు..బీజేపీ లో చేరేందుకు రెడీ అయిపోయాడని వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఇది సహజమే అనుకునేంతలోనే ఓ బాంబు పేల్చాడు.ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని కెలికాడు.అది కూడా ఆషామాషీ వ్యక్తికి సంబంధించింది కాదు. సూపర్ స్టార్ అమితాబ్ కుటుంబానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమితాబ్,ఆయన భార్య జయబాధురి విభేదాలతో విడివిడిగా వుంటున్నారని…దాంతో నాకు సంబంధం ఉందని ఆరోపణలు చేయొద్దంటూ కొత్త చిచ్చు రేపాడు.ఇక ఐశ్వర్య,జయ బాధురి మధ్య కూడా గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది.దాంతో నాకు లింక్ పెట్టొద్దని కూడా అమర్ సింగ్ వ్యాఖ్యానించాడు.

ఒకప్పుడు అమితాబ్ కుటుంబానికి అమర్ సింగ్ ఆప్తుడిగా వ్యవహరించాడు.అయితే కాలం గడిచే కొద్దీ అమర్ ప్రవర్తన నచ్చక అమితాబ్ ఆయన్ను దూరం పెట్టారట. ఈ వయసులో మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని అమితాబ్ కుటుంబాన్ని అమర్ ఇరుకున పెట్టాడు.దీనిపై బిగ్ బీ కుటుంబసభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.