దేశ రెండో రాజధానిగా అమరావతి?

0
179

 Posted October 16, 2016

amarvathi-new-second-capital-for-indiaపొరుగు దేశాలు పాక్,చైనా కుట్రలు..శరవేగంగా మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో రక్షణ అంశానికి ప్రాధాన్యం పెంచాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని nda సర్కార్ నిర్ణయించింది.అందులో భాగంగా దేశ రెండో రాజధాని విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది.ఆ జాబితాలో హైదరాబాద్,అమరావతి గురించి దృష్టి పెట్టిన కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.దీనికి సంబంధించి కేంద్ర హోమ్ శాఖ బృందం త్వరలో అమరావతిలో పరిశీలన జరపనుంది.

హోమ్ శాఖ అమరావతి వైపు అడుగేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో వెలుగు చూడ్డం,వివిధ రక్షణ సంస్థలు ఉండటం తో హైదరాబాద్ విషయంలో కేంద్రం అంత ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఈ పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తోంది.రక్షణ వ్యూహంతో పాటు దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పాటు రాజకీయంగా కూడా మేలు చేస్తుందని nda భావిస్తోంది.2019 ఎన్నికలలోపే రెండో రాజధాని ప్రకటన రావచ్చని కేంద్ర హోమ్ శాఖ నుంచి ఉప్పందుతోంది.అదే జరిగితే అమరావతి దశ తిరిగినట్టే