ఇండియన్స్ తో పెట్టుకోవద్దంటున్న గవర్నర్లు

0
88

 Posted May 6, 2017 at 11:20

america governors wrote letter to donald trump about Paris Environmental Agreement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతదేశం సత్తా గురించి అనూహ్యమైన విశ్లేషణ అందింది. ఏకంగా ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన స్థాయిలో ఈ అంచనాలు ఉండటం ఆసక్తికరం. పారిస్ పర్యావరణ ఒప్పందంపై కీలక నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటానని ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటం సరైన నిర్ణయం కాదని అమెరికాలోని 11 మంది గవర్నర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరారు.

ఒకవేళ అమెరికా తప్పుకుంటే కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై వివిధ దేశాలకు చైనా – ఇండియాలు నాయకత్వం వహించే అవకాశం దక్కుతుందని వారు తేల్చిచెప్పారు.కాలిఫోర్నియా – న్యూయార్క్ – ఒరేగాన్ – వాషింగ్టన్ – పెన్సిల్వేనియా – కొలరాడో – వర్జీనియా – కనెక్టికట్ – హవాయి – డెలావేర్ – రోడీ ఐలాండ్…మొదలైన 11 రాష్ట్రాల గవర్నర్లు ట్రంప్ కు లేఖ రాశారు. పారిస్ పర్యావరణ ఒప్పందం గురించి తమ లేఖలో ట్రంప్ కు ఘాటుగానే రాశారు.

లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా…చైనా ఇండియాతో సహా ఆర్థికంగా బలమైన దేశాలన్నీ ఒప్పందం అమలుకు చర్యలు చేపడుతున్నాయి. అత్యంత ప్రధానమైన ఇంత పెద్ద కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశాన్ని అమెరికా వదులుకుంటే…చైనా ఇండియాలు ఆ అవకాశాన్ని దక్కించుకుంటాయి. ఇదెంతమాత్రమూ అమెరికాకు మంచిది కాదు. ఆర్థిక సాంకేతిక కారణాలతో మనం వెనుకడుగు వేయటం సరైంది కాదు. కార్బన్ ఉద్గారాలను తగ్గించటంపై జాతీయ విధానాల్ని రూపొందించాలి“ అని గవర్నర్లు స్పష్టం చేశారు.