భారత కంపెనీలపై అమెరికా అక్కసు

0
47

Posted April 24, 2017 at 13:14

america message to indian companiesహెచ్ 1బీ వీసాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఆ విధానం సమర్థంగా అమలు చేసేలే వారం వారం వైట్ హౌస్ లో మీటింగ్ పెడుతున్నారు. ఇటీవల జరిగిన అలాంటి సమావేశంలో భారతీయ కంపెనీలు అవసరానికి మించి వీసా అప్లికేషన్లు పెడుతున్నానయి అమెరికా అధికారులు మండిపడ్డారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ హెచ్ 1బీ వీసాలు పొందుతున్న తొలి మూడు కంపెనీలని, ఇవి ఎక్కువ అప్లికేషన్లు పెట్టడం ద్వారా లాటరీలో తమవారికే ఎక్కువ వీసాలు వచ్చేలా జాగ్రత్త పడుతున్నాయని తేల్చిచెప్పారు.

అందుకే లాటరీ విధానం మార్చేశామన్న అమెరికా.. ఈసారి అమెరికన్ స్థానంలో ఫారినర్ కు ఉద్యోగం ఇవ్వడం అంత తేలిక కాదంటున్నాయి. భారతీయ కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగుల్ని అమెరికా తీసుకొస్తున్నాయని, వారి జీతం సగటు సిలికాన్ వ్యాలీ ఇంజినీర్ కంటే చాలా తక్కువగా ఉందంటున్నారు. దీంతో అమెరికా అధికారులు భారత్ కంపెనీల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇండియన్ ఐటీ కంపెనీలు అలర్టయ్యాయి. ఇండియా నుంచి వలస ఉద్యోగుల్ని తేకుండా.. స్థానికుల్నే రిక్రూట్ చేసుకుంటున్నాయి.

సాధారణంగా ఇండియాలో టాప్ టెన్ టెక్ కాలేజీలు, బిజినెస్ స్కూళ్ల నుంచి సాఫ్ట్ వేర్ రిక్రూట్ మెంట్లు జరుగుతాయి. అమెరికాలో కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ టాప్ టెన్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి భారత ఐటీ కంపెనీలు. ఎలాగైనా ఇండియన్ కంపెనీల్ని బయటకు పంపించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. ప్రతిసారీ మన ఐటీ కంపెనీల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇండియా కంపెనీల్నే ఎందుకు ప్రస్తావించారని అడిగితే.. హెచ్ 1బీ వీసాలు పొందుతున్న టాప్ త్రీ కంపెనీలు ఇండియావేనని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆన్సరే ఇందుకు ఉదాహరణ.