అమీషా వాటితో సరిపెట్టుకోవాల్సిందేనా..!

Posted November 24, 2016

amisha patel item song akathayi movieబాలీవుడ్ హాట్ న్యూటీ అమిషా పటేల్ టాలీవుడ్ కు సుపరిచితురాలే.. అమ్మడు చేసిన బద్రి సూపర్ హిట్ అవ్వగా మహేష్ తో నాని ఫ్లాప్ అయినా క్రేజ్ సంపాదించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాలో నటించినా అది కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక చివరగా బాలయ్య పరమవీరచక్ర సినిమాలో నటించినా లాభం లేకుండా పోయింది. బాలీవుడ్ లో కూడా ఫేడవుట్ అయిన అమిషా పటేల్ ఇప్పుడు టాలీవుడ్లో ఐటం అవతారం ఎత్తింది.

ఆకతాయి సినిమాలో అమిషా స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ తో మళ్లీ తన సత్తా ఏంటో చూపించాలని చూస్తుంది అమిషా పటేల్. స్టార్స్ తో హీరోయిన్ గా నటించిన అమ్మడు ప్రస్తుతం ఐటంగా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. జాని మాస్టర్ కంపోజింగ్ లో వస్తున్న ఈ ఐటం సాంగ్ కచ్చితంగా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే అమిషా టాలీవుడ్లో కాస్త ఊపందుకునే అవకాశం ఉంది.

అమిషా అందాలతో రాబోతున్న ఈ ఆకతాయి ఏ రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందో తెలియదు కాని కేవలం ఆమె సాంగ్ తోనే సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ ఇచ్చేసి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.