వర్మ తిక్క ప్రశ్నకు అమితాబ్‌ ఆగ్రహం

0
75

 Posted May 6, 2017 at 17:52

amitabh bachchan angry on ram gopal varma in sarkar movie pramotion interview
బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌కు రామ్‌ గోపాల్‌ వర్మ అంటే చాలా అభిమానం. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఈ స్థాయిలో ఉంది అంటే అది ఖచ్చితంగా రామ్‌ గోపాల్‌ వర్మ వల్లే అని అమితాబచ్చన్‌ నమ్ముతున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం అమితాబచ్చన్‌తో సర్కార్‌ సీక్వెల్‌ను చేస్తున్న విషయం తెల్సిందే. వర్మతో ఎన్ని సినిమాలు చేసేందుకు అయినా తాను సిద్దంగా ఉన్నానంటూ అమితాబచ్చన్‌ గతంలో పలు సార్లు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అంత అభిమానం వర్మపై ఉన్న అమితాబ్‌ చిరాకు పడ్డట్లుగా తెలుస్తోంది.

వర్మ తాజాగా ‘సర్కార్‌ 3’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమితాబచ్చన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ సందర్బంగా వర్మ అడిగిన ఒక ప్రశ్న అమితాబచ్చన్‌కు చిరాకు తెప్పించింది. ఆ ప్రశ్నను మళ్లీ మళ్లీ వర్మ అడగడంతో అమితాబ్‌ కాస్త కఠువుగా వర్మకు సంబంధానం చెప్పినట్లుగా అక్కడే ఉన్న కొందరు మీడియా వారు చెబుతున్నారు. వర్మ మాట్లాడుతూ మరో అమితాబ్‌ ఉంటాడని మీరు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా అమితాబ్‌ అలా ఎవరు అనుకుంటారు చెప్పండి అన్నాడు. అదే ప్రశ్నను పొడిగిస్తూ ఆరడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న వ్యక్తి అమితాబ్‌ అవుతాడని మీరు భావిస్తున్నారా అంటూ వర్మ ప్రశ్నించడంతో అమితాబ్‌ అసహనంతో త ఊపుతూ సారీ రాము, మీరు అడిగింది చాలా పిచ్చి ప్రశ్న అంటూ అమితాబచ్చన్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ, తనకు తానే ప్రశ్నలు సందించుకుంటూ వర్మ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అలాగే అమితాబ్‌ విషయంలో చేయాలని అనుకుని ఇలా ప్రశ్నించి ఉంటాడు. కాని అమితాబ్‌కు మాత్రం అది నచ్చలేదు. అందుకే సీన్‌ రివర్స్‌ అయ్యింది.