రైతు సంక్షేమమే మోడీ ధ్యేయం…అమిత్ షా

Posted November 26, 2016

 amith shah said Rythu Mahasabha modi ambition is farmers keep happyరైతు సంక్షేమానికి ఎన్ డీ ఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లి గూడెం లో రైతు మహా సభకు హాజరయ్యారు. అయన మాట్లాడుతూ .యూరియా దారిమళ్ళకుండ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు . ఈ మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని దీని వల్ల రైతు ఎక్కడైన అమ్ముకోవచ్చని చెప్పారు . ప్రధాని ఫసల్ యోజన వలన ఎంతో మేలు , సంరక్షణ కల్పిస్తుందని , అన్నారు , విపక్షాలు కేవలం రాద్ధాంతం కోసమే ప్రచారం చేతున్నాయని, రద్దు వాళ్ళ రైతులకే లాభం ఉందని నల్ల దానం పొతే అందరు బావుంటారని , కొద్దిరోజులు ఈ కష్టాలు తప్పవని అన్నారు , కేంద్రం ఆంధ్రాకి సంపూర్ణ సహకారం అందిస్తోందని , కాంగ్రెస్ తప్పుడు ప్రచారమే స్పెషల్ స్టేటస్ బీజేపీ ఇవ్వలేదని , కానీ 14 వ ఆర్ధిక సంఘం ప్రకారమే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేక పోతున్నామని ఈ సంఘం కాంగ్రెస్ హయం లోనే ఏరపాటు జరిగిందని చెప్పారు , పోలవరం కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తోందని చెప్పారు ,ఆంధ్రాకి రావాల్సిన అన్ని లాభాలను అండ ఇవ్వడానికి సిద్ధంగా  ఉందని చెప్పారు. ఆంధ్రా అభివృద్ధి మోడీ ప్రభుత్వ బాధ్యత అని , అన్నారు.

తాడేపల్లి అదేం విశాఖ ల్లో జరిగిన సభల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విదేశాల్లోని నల్లధనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రప్పిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లధనం వెలికితీతపై తొలి తీర్మానం, పోలవరం ప్రాజెక్టుపై మలి తీర్మానం చేశారని, అప్పట్నుంచే ప్రధాని నల్లధనంపై యుద్ధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందంతో స్విస్ బ్యాంక్ ఖాతాల్లో దాచుకున్న భారతీయుల నల్లధనం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయన్నారు.

ఆర్థిక అసమానతల్ని సరిచేయడానికే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. మోదీ తిరుగుబాటుదారుడని, పరిస్థితులతో రాజీపడరని, గుజరాత్‌లో మూడు దఫాలు ఆ పట్టుదలతోనే విజయం సాధించారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు చర్య వల్ల వేలాదిమందికే నష్టమని, కోట్లాదిమంది పేద, మధ్యతరగతి వారికి లాభం చేకూరుతుందన్నారు.