బిగ్ బీ మెచ్చిన మిస్టర్ ఫర్ ఫెక్ట్ !

Posted October 3, 2016

amithab ameer khan movieబాలీవుడ్ లో మరో సన్సేషన్ కాంబినేషన్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ తో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు
కలసి నటించారు. ఇక, ఖాన్ త్రయంలో మిగిలింది మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్
ఖాన్ ఒక్కడే. ఇప్పుడీ కలయికకి కుదరనుంది. అమితాబ్-అమీర్ కలయికలో ఓ సినిమా
తెరకెక్కనుంది.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘ధూమ్’, ‘ధూమ్ 2’ చిత్రాలకు రచయితగా
వ్యవహరించారు విజయ్‌కృష్ణ ఆచార్య. ఆ తర్వాత ‘ధూమ్ 3’తో దర్శకుడిగా
మారాడు. తాజాగా, విజయ్‌కృష్ణ దర్శకత్వంలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం
తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్-అమీర్ కలసి నటించనున్నారు. ఈ విషయంపై
స్వయంగా అమీర్ స్పందిస్తూ.. “ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న సువర్ణావకాశం
రానే వచ్చింది. లెజెండ్రీ ఆర్టిస్ట్ అమితాబ్‌తో సినిమా చేయబోతున్నా” అంటూ
ఆనందం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. బిగ్ బీ కూడా అమిర్ తో నటించబోయే చిత్రంపై స్పందించారు. ”
‘‘ఆమిర్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. నాకన్నా తనే గొప్ప నటుడు. వైవిధ్యమైన
పాత్రల్లో అతన్ని చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఆమిర్ అద్భుతమైన నటుడు’’ అంటూ
చెప్పుకొచ్చారు. మొత్తానికి.. బిగ్ బీ అమితాబ్ – అమీర్ ఖాన్ ల కలయిక
బాలీవుడ్ జనాలని మస్మరైజ్ చేయడం ఖాయమనే కామెంట్స్ అప్పుడే మొదలయ్యాయి.
అన్నట్టు.. ఈ చిత్రం వచ్చే యేడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
2017 దీపావఌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందులు ప్లాన్ చేస్తున్నారు.