నువ్వు కన్యవా? తాప్సిని నిలేసిన పెద్దమనిషి ..

  amithab said tapsee vergin pink movie

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దెబ్బకు.. హీరోయిన్ తాప్సీ పొన్ను బెంబేలెత్తిపోయింది. అమితాబ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తల్లడిల్లిపోయింది. కోర్టులో అందరూ చూస్తుండగా.. నువ్వు కన్యేవనా? ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? చెప్పు నువ్వు వర్జినా? కాదా? తలూపడం కాదు? చెప్పు? అంటూ అమితాబ్ తనను అడుగుతుంటే తాప్సీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

అమితాబ్ ఏమిటి? తాప్సీ ఏమిటి? ప్రశ్నలడగటమేమిటి? అనుకుంటున్నారా? ఇదంతా జరిగింది ఒక సినిమాలో. అమితాబ్, తాప్సీ కలిసి పింక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తాప్సీని కొందరు దుండగులు అత్యాచారం చేస్తారు. దీనిపై తాప్సీ కోర్టును ఆశ్రయిస్తుంది. కోర్టులో ముద్దాయిల పట్ల వకల్తా పుచ్చుకున్న అమితాబ్.. తాప్సీని తన ప్రశ్నలతో ఉక్కిబిక్కిరి చేస్తాడు. ఈ సన్నివేశాలతో కూడిన సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది.

ఈ ట్రైలర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కేసు విచారణ ఎలా పూర్తయింది? తాప్సీకి న్యాయం జరిగిందా.. లేదా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 16న విడుదలయ్యే పింక్ చిత్రం చూడాల్సిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథతో, ఒక మహిళ న్యాయపోరాటం న్యేపథ్యంగా అనిరుద్ధ రాయ్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందించారు.