అమ్మ ఆస్తులు ఎప్పుడో రాసేసిందట..?

Posted December 14, 2016

amma wrote willతమిళ నాడు ముఖ్యఎం జయలలిత ఆస్తులకు సంబంధించి న ఆస్తులు ఆమె తదనంతరం ఎవరికి చెందుతాయి అనే విషయం మీద అందరిలో సందేహాలు తలెత్తుతున్న తరుణం లో ఈ విషయం వెల్లడి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది .ఆమె తనకు వచ్చే ఈ పరిస్థితిని ముందే ఊహించి వీలునామా రాశారా అంటే అవును అనే అనాల్సి వస్తోంది …తాజా గా మీడియా లో వస్తున్నా కధనాల ప్రకారం 16 ఏళ్ల కిందటే జయ తన ఆస్తులకు సంబంధించి వీలునామా రాసిందట.హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్‌ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్‌ చేశారు. వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి గోప్యం గా ఉంచుతామని అధికారులు అంటున్నారట

రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్‌ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్‌ హెయిర్‌)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు సాధ్యం కాదు ఈ వీలునామాతోపాటు రెండు ట్రస్ట్‌లను కూడా జయలలిత 2000 జూలై 14న రిజిస్ట్రేషన్‌ చేశారని తెలుస్తోంది. హైదరాబాద్‌ నగర శివారులోని జేజే గార్డెన్స్‌లో జరిగింది. హైదరాబాద్‌(పేట్‌ బషీరాబాద్‌)లోని తన గార్డెన్స్‌ చిరునామాతో చేయించారు. ‘పురట్చి తలైవి బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్, నమద్‌ ఎంజీఆర్‌ బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’లను (డాక్యుమెంట్‌ నంబర్లు బుక్‌ 4లో 31, 32) రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ ట్రస్టుల నిర్వాహకులుగా జయలలిత తన పేరుతోపాటు తన నెచ్చెలి శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను చేర్చారు. ఆపై 2001లో ట్రస్ట్‌ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేశారు.మేడ్చల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకొని ఇలాగే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ పదవీ విరమణ చేసినప్పటికీ జయలలిత ఆస్తుల కేసు విచారణ సమయంలో పలుమార్లు సీబీఐ, న్యాయస్థానాల ఎదుట హాజరయ్యారట .