అమీర్ 1000 కోట్ల క్లబ్ లోకి?

Posted December 24, 2016

ammerkhan 1000 crores club
దంగల్ రూపంలో అమీర్ ఖాన్ చేపట్టిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయినట్టే వుంది.దేశమంతటా ఆ సినిమా గురించి ..అమీర్ నటన గురించి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక కొత్త సినిమాల్ని చీల్చి చెండాడే విమర్శకులు సైతం దంగల్ మీద పోటీలుపడి మరీ పొగడ్తలు కురిపిస్తున్నారు. దాదాపు 95 శాతం రివ్యూ లు పాజిటివ్ గా వచ్చాయి.అమీర్ తో ఢీకొట్టే సల్మాన్ ఖాన్ సైతం దంగల్ ని గొప్ప సినిమాగా పొగిడేసాడు.వస్తున్న సానుకూల నివేదికలు చూస్తుంటే దంగల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేట్టు కనిపిస్తోంది.ఈ సినిమాకి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే అర్హత ఉందని బాలీవుడ్ క్రిటిక్స్ ఏక కంఠంతో చెప్తున్న మాట.

ammerkhan 1000 crores club
ఎన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చినా వెయ్యి కోట్లు అనేది చిన్నాచితకా విషయం కాదు.ఆ స్థాయి సక్సెస్ రావాలంటే ప్రమోషన్ కూడా అదే లెవెల్ లో ఉండాలి.అక్కడ దంగల్ టీం కాస్త వెనక పడినట్టుంది.ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు సరైన పబ్లిసిటీ తోడైతే సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరకపోయినా అమీర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.ఇందులో సందేహం లేదు.