ఆనం బ్రదర్స్ మధ్య చిచ్చు ..వైసీపీ గూటికి వివేకా?

0
90

Posted April 24, 2017 at 12:09

anam vivekananda reddy may join in ysrcp
శ్రోత వక్త అయితే సంతోషంతో పాటు వేదికకి తగ్గట్టు వ్యవహరించగలమా,లేదా అన్న టెన్షన్ ఉంటుంది.అదే వక్త శ్రోతగా మిగిలిపోవాల్సి వస్తే రెండందాలా బాధ.వేదిక నుంచి కిందకు దిగామన్న బాధ ఓ వైపు..వేదిక మీద వాడి కన్నా తానేమి తక్కువన్న ఆక్రోశం ఇంకోవైపు.ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది ఆనం బ్రదర్స్ కి.ఏ పార్టీలో వున్నా తమ ఇంటి నుంచే వ్యవహారాలు చక్కబెట్టిన ఈ అన్నదమ్ములకు టీడీపీ లో అంత గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నారు.పార్టీలో చేరేటప్పుడు వివేకాకు ఎమ్మెల్సీ పదవి,రామనారాయణ రెడ్డి కి ఆత్మకూరు పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తామని టీడీపీ హైకమాండ్ నుంచి హామీ ఇప్పించారట అదే జిల్లాకి చెందిన మంత్రి నారాయణ.అయితే ఆ హామీలో ఒక్కటి మాత్రమే నెరవేరింది.వివేకా విషయంలో పార్టీ ఇప్పటికీ ఎమ్మెల్సీ ఇవ్వలేదుసరికదా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన బాధపడిపోతున్నారు.దీంతో పార్టీ మారుదామని రామనారాయణని అడిగితే ఆయన వేచి చూద్దామని చెప్పడంతో వివేకాకు కోపం వచ్చిందట.ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఆనం బ్రదర్స్ మధ్య చిచ్చు రగిలిందట.

ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న వైసీపీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఓ పాచిక విసిరింది. పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి వివేకాతో మాట్లాడే బాధ్యత అప్పగించింది. ఆయన వెంటనే రంగంలోకి దిగి వివేకాకు ఫోన్ చేసి వైసీపీ లోకి ఆహ్వానం పలికాడట.భూమన ప్రతిపాదనపై త్వరలో ఆలోచించి చెబుతానని మాటిచ్చాడట వివేకా.భూమన ఆఫర్ మీద తన సన్నిహితులు,అనుచర వర్గం అభిప్రాయాల్ని తెలుసుకునే పనిలో వున్నాడట వివేకా.అటు టీడీపీ కూడా కాస్త ఆలస్యంగా మేల్కొని వివేకాని బుజ్జగించే పనిలో పడిందట.చివరకు వివేకా ఎటు తేలతాడో ?