తెలంగాణ పై ఆంధ్ర ఎంపీ మోజు..

Posted December 21, 2016

andhra mp like telangana
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు …తెలంగాణ ఇచ్చేస్తారని తేలినప్పుడు ఓ వాదన బలంగా వినిపించింది.అదే రాయలసీమలోని అనంతపురం,కర్నూల్ జిల్లాల్ని తెలంగాణాలో కలపాలని కొందరు వాదించారు ..వారిలో ముందున్నది సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి . ఇప్పుడు విభజన అయిపోయింది.జేసీ గారు అనంతపురం ఎంపీ అయిపోయారు.మూడేళ్లు గడిచినా ఆయనలో ఇంకా తెలంగాణాలో చేరాలన్న మోజు మాత్రం తగ్గలేదు.

అసెంబ్లీ లాబీలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కి జేసీ ఎదురు పడ్డారు.పిచ్చాపాటీ మాట్లాడుతుండగా జేసీ సీమ ప్రస్తావన తెచ్చారు.విభజనతో కర్నూలు,అనంతపురం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని జేసీ చెప్పారు.నీటి కోసం ఆ జిల్లాలు ముఖ్యమంత్రుల మీద ఆధారపడాల్సివస్తోందని రాజేందర్ తో జేసీ వాపోయారు.అదేమిటి మీకు శ్రీశైలం నుంచి నీళ్లు వస్తున్నాయిగా అని ఈటెల ప్రశ్నిస్తే జేసీ వెరైటీ సమాధానం ఇచ్చారు.ఆ రెండు జిల్లాలు తెలంగాణాలో ఉంటే …ఏం కెసిఆర్ మాకు నీళ్లు ఇవ్వవా అని అడిగేవాళ్ళం.మేము తెలంగాణ వాళ్ళమే అని చెప్పేవాళ్ళం.ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో ఏమి అడుగుతామని జేసీ అనేసరికి పక్కనున్న వాళ్ళు ఆంధ్రా ఎంపీ అయినా జేసీ కి ఇంకా తెలంగాణ మోజు పోలేదని అనుకుంటున్నారు.