ఆంధ్రా మంత్రులు మహా ముదుర్లు….!

0
50

 Posted May 6, 2017 at 10:43

andhra pradesh ministers not listening chandrababu words
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరూ తెలుగువాళ్ల కిందనే లెక్క కాబట్టి ఆంధ్రామంత్రులు, తెలంగాణ మంత్రులంటూ ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం రాలేదు. అప్పుడు కూడా ఆంధ్రా, తెలంగాణ అనే విభజన కనబడుతూనే ఉన్నా ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ప్రాంతాల పేరుతో మరీ అంత బహిరంగంగా మాట్లాడుకోవడం జరగలేదు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రా, తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాల మంత్రుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లోని మంత్రుల వ్యవహారశైలి, పనితీరు మొదలైనవి మీడియాలో చర్చకు వస్తున్నాయి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు మహా ముదుర్లు అనిపిస్తోంది. అక్కడ కుల రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు ఎక్కువ. నాయకులు ఏం చేయడానికైనా బరితెగించి ఉంటారనిపిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే ఖాతరు చేయడంలేదనిపిస్తోంది. తెలంగాణలో ఈ పరిస్థితి లేదు. కాని ఆంధ్రాలో మంత్రులు చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోవడంలేదని, ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆంధ్రాలో మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అనుకూల మీడియాలోనూ అనేకసార్లు కథనాలు వచ్చాయి. మంత్రుల పనితీరుపై బాబు అనేకసార్లు అసంతృప్తి వ్యక్తంం చేశారు. తరచుగా వారికి క్లాసులు పీకుతూనే ఉంటారు. అయినప్పటికీ వారి వ్యవహారశైలిలో మార్పులేదు. పనిచేయని మంత్రులను, అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను బాబు ఏమీ చేయలేకపోతున్నారు. ఇందుకు అక్కడి కుల, గ్రూపు రాజకీయాలు ప్రధాన కారణమై ఉండొచ్చు. ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు బెదిరించడం, ధిక్కారంగా మాట్లాడటం సహజం. కాని కొన్ని సందర్భాల్లో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా బాబును ధిక్కరిస్తున్నారు. విమర్శిస్తున్నారు.