త‌మిళ‌నాట ఏపీ సీన్ రిపీట‌వుతుందా?

Posted December 7, 2016

andhra pradesh political scene will repeat in tamil nadu politics
అప్పట్లో వైఎస్ అకాల మ‌ర‌ణంతో ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రమే మారిపోయింది. అప్పటిదాకా జోరుమీదున్న కాంగ్రెస్ కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. వైఎస్ త‌ర్వాత రోశ‌య్య‌, కిర‌ణ్ ముఖ్యమంత్రులుగా ప‌నిచేసినా… వైఎస్ స్థాయిలో ప‌నిచేయ‌లేక‌పోయారు. ఢిల్లీ హైక‌మాండ్ పూర్తి స్వేచ్ఛనిచ్చినా పాల‌న‌లో ఏమాత్రం ప్రభావం చూపెట్టలేక అట్టర్ ఫ్లాప‌య్యారు. రోశ‌య్యను ప‌క్కన‌బెడితే కిర‌ణ్ యువ ముఖ్యమంత్రి అయినా చేసిందేమీ లేదు. 2014 నాటికి పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డిపోయి… ఆయన రాజ‌కీయ జీవిత‌మే త‌ల‌కిందులైపోయింది.

ఇప్పుడు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత కూడా అర్థాంత‌రంగా త‌నువు చాలించ‌డంతో అక్కడా ఏపీ సీన్ రిపీట్ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ప‌న్నీర్ సెల్వం ముఖ్యమంత్రి బాధ్యత‌లు చేప‌ట్టినా… ఆయ‌న పూర్తి కాలం ప‌ద‌విలో ఉంటాడా అన్నది అనుమాన‌మే. ఎందుకంటే జ‌య ఉన్నప్పుడు ప‌రిస్థితి వేరు. ఇప్పుడు ప‌రిస్థితి వేరు. అప్పుడంటే ఎమ్మెల్యేలు అమ్మ మాట జ‌వ‌దాటే వారు కాదు. కానీ మిత‌భాషిగా పేరున్న ప‌న్నీర్ సెల్వం… ఇప్పుడు జ‌య‌లా ప్రభుత్వాన్ని న‌డిపిస్తానంటే అస్సలు కుద‌ర‌దు. అలాగని మ‌రీ నెమ్మదించినా ప్రమాదమే. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ పార్టీలోని అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుంటూ ప‌న్నీర్ సెల్వం ముందుకు సాగాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్పవు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఎప్పుడు ఏ పాము మింగేస్తుందో తెలియ‌దు.

మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టిన ప‌న్నీర్ సెల్వానికి ఈ పాటికే రాజ‌కీయం ఒంటబ‌ట్టి ఉండాలి. ఒక‌వేళ ఆయ‌న ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏపీలోలా ప‌రిస్థితి తారుమారు అయ్యే అవ‌కాశ‌ముంది. సీఎం ఛైర్ ను ఇతరులు లాక్కునే అవ‌కాశముంది. సెల్వం రాజకీయాల నుంచి శాశ్వతంగా బ‌య‌ట‌కు వెళ్లిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు ప‌రిశీల‌కులు.