ఆంధ్రజ్యోతి vs ఈనాడు ..

Posted November 27, 2016

andhrajyothi vs eenaduఆ రెండు అంటూ దివంగత నేత,వుమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈనాడు,ఆంధ్రజ్యోతి ని ఒకే గాటన కట్టారు.అందులో నిజానిజాల మాటెలా వున్నా ..ఆ పత్రికల శైలిలో మార్పులున్నా కొన్నేళ్లుగా వాటి భావజాల వ్యాప్తిలో సారూప్యతలు కనిపించేవి.ఆ రెండు పత్రికల మధ్య ఇప్పుడు విబేధాలు అనలేము గానీ అభిప్రాయాల్లో బేధాలున్నాయి.పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.మోడీ నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే తూర్పారబట్టారు.ఇంత అరాచకమా అని కొత్తపలుకులో మోడీ నిర్ణయం ఫలితాల్ని ఆర్కే ఏకరువుపెట్టారు.చంద్రబాబు సహా రాజకీయపక్షాలన్ని మోడీని నిలవరించడంలో విఫలమయ్యాయని కూడా చెప్పుకొచ్చారు.

మరోవైపు గడిచిన పక్షం రోజులుగా మోడీ నిర్ణయాన్ని సమర్ధించేందుకు ఈనాడు అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది.మోడీ అనుకూల ఆర్థికవేత్తలు అభిప్రాయాలకి పెద్ద పీట వేస్తోంది ఈనాడు.సామాన్యుల కష్టాల కన్నా నల్లధనం మీద పోరాటం గానే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.ఏదేమైనా మోడీ నిర్ణయంతో తెలుగు మీడియా రంగంలో ఓ సరికొత్త దృశ్యం ఆంధ్రజ్యోతి vs ఈనాడు ఆవిష్కృతమైంది.