ఇప్పటికి ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాటే టాప్‌..

Posted November 15, 2016
android kitkat version top place than in all versionగూగుల్‌ నుంచి వచ్చిన అధునాతన అస్త్రం ఆండ్రాయిడ్‌ ఇప్పుడు మార్కెట్‌ని శాసిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 87 శాతం స్మార్ట్‌ఫోన్లలో స్థానం సంపాదించిందంటే దాని రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు… మరి ఆండ్రాయిడ్‌లోనే చాలా వర్షన్లు ఉన్నాయి.. వాటిలో ఏది టాప్‌ అనే ప్రశ్న మీకు రావచ్చు.. ఆండ్రాయిడ్‌ 19 ఏపీఐగా విడుదల చేసిన కిట్‌క్యాట్‌ వర్షన్‌ 25.2 శాతంతో నేటికి టాప్‌లో ఉంది. ఆ తరవాతి స్థానం ఆండ్రాయిడ్‌ 6.0 వర్షన్‌ మార్షమల్లౌ 24 శాతంతో ఉంది. లాలీపప్‌ 5.1 వర్షన్‌ 22.8, లాలీపప్‌ 5.0 వర్షన్‌ 11.3 శాతంతో ఆ తరవాతి స్థానాల్లో ఉన్నాయి.. కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించిన నూగట్‌ 7.0 కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం.. అతి తక్కువ సమయంలోనే 0.3 శాతం మార్కెట్‌ వాటాని దక్కించుకుంది. మొత్తంగా చూసుకుంటే లాలీపప్‌ రెండు వర్షన్లు కలిపితే అదే టాప్‌లో ఉంది కాని.. వర్షన్ల వారీగా చూసుకోవడంతో మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైయ్యింది. ఆండ్రాయిడ్‌ తొలి వర్షన్‌ 2.2 ఫ్రోయో కూడా ఇంకా 0.1 శాతం వాటాతో తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం.. చివర నుంచి ఈ  మూడో స్థానంలో 1.3 శాతంతో జింజర్‌బ్రెడ్‌, ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ కూడా ఉన్నాయి. జెల్లీబీన్‌ 4.1 వర్షన్‌ 4.9 శాతం, 4.2 వర్షన్‌ 6.8 శాతం, 4.3 వర్షన్‌ 2 శాతంతో ఉంది.
android kitkat version top place than in all version