ఆండ్రాయిడ్‌ దెబ్బకు మిగతా ఓఎస్‌లు ఢమాల్‌..! 

 Posted November 4, 2016
android mobile phones better than all different os mobiles
వాడేందుకు సులభంగా ఉండటం..టచ్‌ ఆపరేటింగ్‌కు అనుకూలంగా సిద్ధం చేయడం..చూసేందుకు అందంగా అనిపించడం..మొత్తనాకి తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వంటి వాటి వల్ల..స్మార్ట్‌ఫోన్‌ అంటే ఆండ్రాయిడ్‌..ఆండ్రాయిడ్‌ అంటే స్మార్ట్‌ఫోన్‌ అనేలా ప్రజల్లోకి వెళ్లి పోయింది..ఫలితంగా మార్కెట్‌లో అప్పటి వరకు రాజ్యమేలుతున్న మొబైల్‌ సంస్థల పునాదులు సైతం కదిలాయి.. ఆండ్రాయిడ్‌ అనేది మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వచ్చి ప్రపపంచ రారాజుగా ఉన్న మొబైల్‌ సంస్థ నోకియా కనుమరుగైపోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లలో 87.5 శాతం గూగుల్‌ అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమే ఆక్రమించినట్లు 2016 మూడో త్రైమాసిక వివరాలు తేల్చాయి. అనతికాలంలోనే ఈ ఘనత సాధించడం అద్భుతమే అని చెప్పాలి..యాపిల్‌ ఒక్కటే కొద్ది పోటీ.. 

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు 2015తో పోల్చితే ఈ ఓఎస్‌ వాడేవారి సంఖ్య 3.4 శాతం మేర తన బలిమి పెంచుకున్నట్లు తెలుస్తుంది. 2015 మూడో త్రైమాసికంలో 298 మిలియన్‌ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్‌ ఉంటే ఆ సంఖ్య ప్రస్తుతం 328 మిలియన్లుకు పెరిగింది. యాపిల్‌ ఐవోఎస్‌ 12.1 శాతంతో ఆ తరవాత స్థానంలో నిలిచింది. కాకపోతే గతేడాదితో పోల్చితే 1.5 శాతం తగ్గింది. 48 మిలియన్‌ ఫోన్లు గాను ప్రస్తుతం 45.5 మిలియన్లు ఫోన్లే ఉన్నాయట.. ఇప్పటి వరకు యాపిల్‌ మాత్రమే కొద్దీ గొప్ప పోటీనిస్తుందని చెప్పాలి.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు ఓఎస్‌లు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయి. ఇక మిగిలిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ మైక్రోసాఫ్ట్‌, బ్లాక్‌బెరీ దాదాపు మార్కెట్‌ నుంచి నిష్క్రమించినట్లే.. ఆండ్రాయిడ్‌ దెబ్బకి ఈ రెండూ చర్చల్లో కూడా లేకుండా పోయాయి.. కేవలం 0.3 శాతంతో ఇతరాల్లో చోటు సంపాదిచుకున్నాయి.. గతేడాది 8.2 మిలియన్‌ స్మార్ట్‌ఫోన్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 1.3 యూనిట్లకు పపిపోయింది.