మోడీకి సలహా ఇచ్చినాయన పెదవి విరుపు?

Posted November 22, 2016

anil bokil the man behind modis decision
దేశ ప్రజల్ని బ్యాంకుల ముందు నిలబెట్టిన నిర్ణయం తీసుకున్నది మోడీ అయితే …దాని వెనుక వున్నది అర్థక్రాంతి పేరుతో ఆర్ధిక సిద్ధాంతాల రూపకల్పన చేసిన అనిల్ బొకిల్ అని విరివిగా ప్రచారం సాగింది.అయితే మోడీ తీసుకున్న నిర్ణయం …దాన్ని అమలుచేస్తున్న తీరుపై అనిల్ దాదాపుగా పెదవి విరిచాడు.ఇప్పుడు సాగుతున్న తంతు వల్ల లాభం పెద్దగా లేదని చెప్తున్న అనిల్ అందుకు కారణాలు కూడా వివరించాడు.
ఈ ఏడాది జులై లో అర్థక్రాంతి అనిల్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.తొమ్మిది నిమిషాలపాటు దేశం ఆర్ధిక పరిపుష్టి పొందటానికి తీసుకోవాల్సిన చర్యలపై సరికొత్త ఆలోచనల్ని ప్రధాని ముందుంచారు.అర్థక్రాంతి అనిల్ చేసిన ప్రతిపాదనలు ఇవే …
1 . ప్రత్యక్ష,పరోక్ష పన్నుల్ని పూర్తిగా రద్దు చేసి బ్యాంకు లావాదేవీల మీద పన్ను వేయడం
2 . 50 రూపాయలు మినహా అంతకు మించి విలువున్న అన్ని పెద్ద నోట్లని రద్దు చేయడం
3 . 2 వేల రూపాయలకి మించిన బ్యాంకు లావాదేవీల మీద చట్టపరమైన పరిమితులు పెట్టడం

ఈ ప్రతిపాదనల్లో మోడీ కొన్నిటిని మాత్రమే తీసుకుని మరికొన్నిటిని నిర్లక్ష్యం చేయడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని అనిల్ అంటున్నారు.ఏమైనా స్వతంత్రం తరువాత ఓ ప్రధాని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి ప్రేరేపించిన వ్యక్తే పెదవి విరుస్తున్నాడంటే …..లోటుపాట్లపై మోడీ దృష్టిపెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.