పవన్ ఫ్యాన్స్ కోరుకునట్టే..!

Posted November 25, 2016

anirudh exitement for pawan kalyan movieకోలీవుడ్ లో సూపర్ మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంతకుముందే బ్రూస్ లీ, అఆ సినిమాలకు అవకాశం వచ్చినా అవి చేయకుండా తప్పుకున్న అనిరుధ్ ఈసారి మాత్రం పవన్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. చేసేది తమిళ సినిమాలే అయినా పవర్ స్టార్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకున్న అనిరుధ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలతోనే అవి అందుకునేలా మ్యూజిక్ ఇస్తానని అంటున్నాడు.

ఇప్పటికే త్రివిక్రంతో స్టోరీ డిస్కషన్ చేశానని.. సో ఆ సినిమాకు తన బెస్ట్ అవుట్ పుట్ ఇస్తానని అంటున్నాడు అనిరుధ్. టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అనిరుధ్ పవన్ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదిస్తాడని చెప్పొచ్చు. ఈ సినిమా మ్యూజిక్ పరంగా హిట్ అయితే కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అనిరుధ్ బిజీ అయ్యే అవకాశాలున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటాడో సినిమా వస్తేనే గాని చెప్పలేం.